అన్వేషించండి

Ather Konarc S 125 Features : ధర నుంచి పవర్‌, రేంజ్ వరకు.. ఏథర్ కోణార్క్‌ ఎస్ 125కి పోటీగా నిలిచే స్కూటర్లు ఏవి?

ఏథర్ కోణార్క్‌ ఎస్ 125 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, రేంజ్, బ్యాటరీ, మోటార్, ఫీచర్లు & టీవీఎస్, చేతక్, విడా మోడళ్లతో పూర్తి పోలిక.

Ather Konarc S 125 Price, Range And Features Telugu: ఏథర్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కంపెనీ ఇటీవలే లాంచ్‌ చేసిన కొత్త మోడల్‌.. కోణార్క్‌ ఎస్ 125 ‍‌(Ather Konarc S 125). కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ స్కూటర్‌లో వివిధ వేరియంట్లు ఉన్నాయి. అందులో.. కోణార్క్‌ ఎస్ 125 అనేది ఎంట్రీ లెవల్ మోడల్‌. ఈ బండి ధర రూ.1.22 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధరలో.. దీని ప్రధాన ప్రత్యర్థులుగా TVS iQube 3.1 kWh ‍(రూ. 1.29 లక్షలు)‌, Bajaj Chetak C3001 (రూ. 1.14 లక్షలు)‌ & Vida VX2 Go 3.1 (రూ. 1.12 లక్షలు)‌ నిలుస్తున్నాయి.

రేంజ్‌

కోణార్క్‌ ఎస్ 125 కి 125 కిలోమీటర్ల IDC రేంజ్ ఉంది. ఇందులో 2.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. మోటార్ గరిష్ఠ శక్తి 4 kW. టార్క్ 16 Nmగా ఉంది. 

రేంజ్‌ పోలికలో బజాజ్ చేతక్ C3001 అత్యధిక రేంజ్ అందిస్తోంది. దీని IDC రేంజ్ 131 కిలోమీటర్లు. ఇందులో 3 kWh బ్యాటరీ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లు. 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 2 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఈ విభాగంలో ఇది వేగవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తోంది.

టీవీఎస్ ఐక్యూబ్ 3.1 kWh కి 123 కిలోమీటర్ల IDC రేంజ్ ఉంది. దీని మోటార్ 4.4 kW శక్తిని ఇస్తుంది. 33 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పోలికలో అత్యధిక టార్క్ ఉన్న మోడల్ ఇదే. దీని గరిష్ఠ వేగం గంటకు 82 కిలోమీటర్లు.

విడా VX2 Go 3.1 మాత్రం 6 kW మోటార్‌తో అత్యధిక పవర్‌ అందిస్తోంది. దీని IDC రేంజ్ 127 కిలోమీటర్లు. గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర ఎంత? రూ.10000 చెల్లిస్తే నెలవారీ EMI ఎంత కట్టాలి

పరిమాణాలు 

కోణార్క్‌ వీల్‌బేస్ 1,352 మిల్లీమీటర్లు. సీటు ఎత్తు 770 మిల్లీమీటర్లు. బరువు 126.5 కిలోలు. చేతక్ C3001 వీల్‌బేస్ 1,355 మిల్లీమీటర్లతో ఈ జాబితాలో ముందుంది. దీని బరువు 125 కిలోలు.

టీవీఎస్ ఐక్యూబ్ మాత్రం తేలికైన మోడల్. దీని బరువు 116.8 కిలోలు. సీటు ఎత్తు కూడా 770 మిల్లీమీటర్లే. విడా VX2 Go బరువు 118 కిలోలు. సీటు ఎత్తు 777 మిల్లీమీటర్లు.

ఫీచర్లు

ఫీచర్ల విషయంలో ఏథర్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కోణార్క్‌‌లో 7 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. AirWalk ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. స్కూటర్‌ను చేతితో కదిలించినా సులభంగా కదులుతుంది. అయితే.. ఏథర్‌లోని అధునాతన ఫీచర్ల కోసం StackPro ప్యాక్ అవసరం, ఈ ప్యాక్‌ ధర రూ.16,000. ఇందులో TrueRange, AutoHold & Vehicle FallSafe వంటి ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు & కొత్త ఫీచర్లను కూడా ఏథర్ అందించనుంది.

చేతక్ టెక్‌ప్యాక్ ధర రూ.3,000. ఇది జీవితకాల సబ్‌స్క్రిప్షన్‌గా ఉంటుంది. విడా ఏడాదికి రూ.999, టీవీఎస్ ఏడాదికి రూ.900 వసూలు చేస్తున్నాయి.

ధరలో విడా VX2 Go 3.1 అత్యంత చౌక. దీని ధర రూ.1.12 లక్షలు. చేతక్ C3001 ధర రూ.1.14 లక్షలు. కోణార్క్‌ ఎస్ 125 ధర రూ.1.22 లక్షలు. టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.29 లక్షలు.

ఇది కూడా చదవండి: కొత్త Bajaj Pulsar 125లో 4 వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

మొత్తంగా చూస్తే.. రేంజ్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారికి చేతక్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎక్కువ మోటార్ శక్తి కావాలంటే విడా ముందుంటుంది. ఎక్కువ టార్క్ కావాలంటే ఐక్యూబ్ మెరుగైన ఎంపిక. ఫీచర్లు & ఆధునిక టెక్నాలజీ కోరుకునేవారికి కోణార్క్‌ ఎస్ 125 ఒక ఆప్షన్‌ అవుతుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు, ధరతో పాటు వాస్తవ రైడింగ్ అనుభవం, సౌకర్యం & నిర్వహణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget