అన్వేషించండి

కారుకు CNG కిట్ పెట్టిస్తే ఎంత ఖర్చవుతుంది? పోలీసులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఇబ్బందులు వస్తాయా?

కారుకు CNG కిట్ పెట్టించాలనుకుంటున్నారా? కిట్ రకాలు, ఖర్చు, ఇన్‌స్టాలేషన్, చట్టబద్ధత, మెయింటెనెన్స్ & వారంటీ పూర్తి వివరాలు తెలుసుకోండి.

CNG kit installation cost to a car: పెట్రోల్ ధరలు హైరేంజ్‌కు చేరిన నేపథ్యంలో, కార్ల నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడమే ప్రథమ కర్తవ్యం. దీంతో CNG కార్లకు డిమాండ్ పెరిగింది. ఫ్యాక్టరీ నుంచే CNGతో వచ్చే కార్లు ఇప్పుడు చాలానే ఉన్నాయి. అయితే అన్ని మోడళ్లలో CNG ఆప్షన్ లేదు. దీంతో ఇప్పటికే కారు ఉన్నవాళ్లు ఆఫ్టర్‌మార్కెట్ CNG కిట్ వైపు చూస్తున్నారు. కారుకు CNG కిట్ పెట్టించడం అంత సులభమైన విషయం కాదు. ఏ కిట్ తీసుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? ఎవరి దగ్గర ఇన్‌స్టాల్ చేయించాలి? చట్టబద్ధమేనా? వారంటీ ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

ఖర్చు

CNG కిట్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. పాత తరహా వెంచురి కిట్‌ను సాధారణంగా BS3 & అంతకంటే పాత కార్లకు ఉపయోగిస్తారు. ఇందులో CNGని గాలితో కలిపి ఇంజిన్‌లోకి పంపిస్తారు. ఇవి తక్కువ ధరలో లభిస్తాయి. ఇన్‌స్టాలేషన్ & రిజిస్ట్రేషన్ కలిపి సుమారు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఖర్చవుతుంది. అయితే పనితీరు తగ్గుతుంది. అందుకే ఈ కిట్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి.

ఆధునిక న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ MPFI కార్లకు సీక్వెన్షియల్ కిట్ ఉపయోగిస్తారు. ఇందులో ప్రత్యేక ఇంజెక్టర్లు & ECU ఉంటాయి. ఇంజిన్ వేగం, డ్రైవర్ ఇన్‌పుట్ ఆధారంగా CNG సరఫరాను ECU నియంత్రిస్తుంది. పెర్ఫార్మెన్స్‌ తగ్గడం కూడా తక్కువగా ఉంటుంది. పాత BS4 కార్లకు ఈ కిట్ ధర సుమారు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. చిన్న BS6 కార్లకు రూ.50,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చవుతుంది. పెద్ద కార్లకు 8 ఇంజెక్టర్ల కిట్ అవసరమైతే, ఖర్చు రూ.70,000 నుంచి రూ.75,000 వరకు చేరొచ్చు.

డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ల కోసం మరో రకం కిట్ ఉంటుంది. వీటిలో CNGతో పాటు కొంత పెట్రోల్ కూడా అవసరం. ఇంజిన్ ఇంధన ఇంజెక్టర్లు వేడెక్కకుండా ఉండటమే దీనికి కారణం. టర్బో డైరెక్ట్ ఇంజెక్షన్ కార్లు గరిష్ఠంగా 80:20 నిష్పత్తిలో CNG & పెట్రోల్‌తో నడుస్తాయి. ఈ కిట్ల ధర రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది.

CNG వ్యవస్థలో అతిపెద్ద భాగం ట్యాంక్. సాధారణంగా ఇది సీమ్‌లెస్ స్టీల్‌తో తయారవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడే దాదాపు 70 కిలోల బరువు ఉండొచ్చు. దీని సామర్థ్యం 60 నుంచి 65 లీటర్ల వరకు ఉంటుంది. తేలికైన కాంపోజిట్ ట్యాంకులు కూడా ఉన్నాయి. అయితే వాటి ధర ఎక్కువగా ఉంటుంది.

ట్యాంక్ నుంచి గ్యాస్‌ను ఇంజిన్‌కు పంపేందుకు హై ప్రెజర్ పైపులు, ప్రెజర్ రిడ్యూసర్, ఇంజెక్టర్ రైల్, MAP సెన్సార్, ECU వంటి భాగాలు ఉంటాయి. ట్యాంక్‌లో దాదాపు 200bar ఒత్తిడితో ఉన్న CNGని రెడ్యూసర్ 2bar నుంచి 3bar స్థాయికి తగ్గిస్తుంది. ఆ తర్వాత ఇంజెక్టర్ల ద్వారా ఇంజిన్‌లోకి పంపుతుంది.

విడిభాగాలు

ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్‌కు సాధారణంగా 4 నుంచి 5 గంటలు పడుతుంది. ముందుగా ఇంజిన్ పరిస్థితిని తనిఖీ చేస్తారు. అవసరమైతే స్పార్క్ ప్లగ్స్, ఇగ్నిషన్ కాయిల్స్ మారుస్తారు. థ్రాటిల్ బాడీని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత రెడ్యూసర్, ఇంజెక్టర్లు & ECUని అమరుస్తారు. ట్యాంక్ కోసం బూట్‌లో ప్రత్యేక ఫ్రేమ్ ఏర్పాటు చేస్తారు. హై ప్రెజర్ పైపులను కారు కిందుగా అమర్చుతారు. డ్యాష్‌బోర్డ్‌పై CNG స్విచ్ ఏర్పాటు చేస్తారు.

ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత లీక్ టెస్ట్ తప్పనిసరి. సుమారు 2 కిలోల CNG నింపి ప్రతి కనెక్షన్‌ను తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్ గ్యాస్ డిటెక్టర్‌తో పాటు సబ్బు ద్రావణంతోనూ లీకేజీ ఉందా అని చూస్తారు. చివరగా సిస్టమ్‌ను కాలిబ్రేట్ చేసి రోడ్ టెస్ట్ చేస్తారు.

ఇది కూడా చదవండి: పెట్రోల్ బాదుడుకి చెక్ చెబుదాం - పాత వాహనాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చడం ఎలా?

కొన్ని ఇబ్బందులు

అయితే ఆఫ్టర్‌మార్కెట్ CNG కిట్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫ్యాక్టరీ CNG మోడల్‌తో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండొచ్చు. కానీ కొత్త కారుకు కిట్ వేయిస్తే తయారీదారు వారంటీ రద్దయ్యే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు ఇంజిన్‌కు సంబంధం లేని వారంటీ క్లెయిమ్‌లను ఓకే చేయవచ్చు, అయితే ఇది పూర్తిగా కంపెనీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

CNG కిట్‌ అమరిస్తే కారులో బూట్ స్పేస్ కూడా తగ్గుతుంది. ఫ్యాక్టరీ CNG కార్లలో అండర్‌బాడీ లేదా డ్యూయల్ ట్యాంక్ వంటి పరిష్కారాలు ఉంటాయి. ఆఫ్టర్‌మార్కెట్ కిట్లలో మాత్రం పెద్ద సింగిల్ ట్యాంక్‌ను బూట్‌లో ఏర్పాటు చేయడం సాధారణంగా జరుగుతుంది. 

మెయింటెనెన్స్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. CNG ట్యాంక్‌ను ప్రతి మూడేళ్లకు ఒకసారి హైడ్రో టెస్ట్ చేయించాలి. ఇందుకోసం ట్యాంక్‌ను కారు నుంచి తొలగించి ప్రత్యేక కేంద్రానికి పంపాలి. ఒక్క ట్యాంక్‌కు ఈ పరీక్ష ఖర్చు సుమారు రూ.3,000 ఉంటుంది.

CNG ఫిల్టర్‌ను ప్రతి మూడేళ్లకు లేదా 10,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాలి. సాధారణంగా దీని ఖర్చు రూ.1,000లోపే ఉంటుంది. ఇంధన వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు కనీసం 10 శాతం ప్రయాణాన్ని పెట్రోల్‌తో చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చట్టపరమైన సవాళ్లు

చట్టపరంగా చూస్తే ఆఫ్టర్‌మార్కెట్ CNG కిట్‌కు అనుమతి ఉంది. అయితే కిట్ ప్రభుత్వం ఆమోదించినదై ఉండాలి. అనుమతి పొందిన ఇన్‌స్టాలర్‌తోనే అమర్చాలి. ఇన్‌స్టాలేషన్ తర్వాత, RTO ఆఫీస్‌కు వెళ్లి మీ కారు RCలో CNG మార్పు గురించి నమోదు చేయించాలి, కొత్త RC తీసుకోవాలి. లేకపోతే ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ సంస్థకు కూడా సమాచారం ఇవ్వాలి.

ఇది కూడా చదవండి: ఇంజిన్ ఆఫ్ చేసినా కారు టిక్‌ టిక్‌ శబ్దం ఎందుకు చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోండి!

ఏ కారుకైనా CNG కిట్ పెట్టించొచ్చా?

ఏ కారుకైనా CNG కిట్ పెట్టించకూడదు. పెట్రోల్ కార్లను CNGకి మార్చడం సాధ్యమే. డీజిల్ కార్లకు మాత్రం చాలా మార్పులు అవసరం. మంచి మెకానికల్ కండిషన్‌లో లేని కార్లను CNGకి మార్చడం మంచిది కాదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget