అన్వేషించండి

10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి

భారత్‌లో కియా తన కొత్త 7 సీటర్ అయిన Sorentoను లాంచ్ చేసింది. రూ.27.99 లక్షల ప్రారంభ ధరలో ఇందులో హైబ్రిడ్, డీజిల్ రెండూ ఇంజిన్లు, అలాగే AWD ఆప్షన్ లభిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కియా సోరెంటో SUV ₹27.99 లక్షల ప్రారంభ ధరతో భారత్‌లో విడుదల.
  • ఆధునిక డిజైన్, విలాసవంతమైన కేబిన్, హైటెక్ ఫీచర్లు కలిగివుంది.
  • హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు, ఆల్-వీల్ డ్రైవ్ ఉన్నాయి.
  • పది ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, అధిక మైలేజ్‌తో పోటీనిస్తోంది.

భారత్‌లో పెద్ద SUVలు ఖరీదు అయినా వాటికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొరియన్ కార్ తయారీ సంస్థ కియా తన ఫ్లాగ్‌షిప్ SUV కియా సోరెంటోను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ పెద్ద లగ్జరీ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 27.99 లక్షలుగా నిర్ణయించగా, హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర 35,38,679 గా ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర 40 లక్షలకుపైగా ఉంటుంది. భారత మార్కెట్లో దీనికి ఫాక్స్‌వాగన్ టైరాన్, స్కోడా కోడియాక్, టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లతో పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

అయితే అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది అన్ని వాతావరణాల్లో, ఆఫ్-రోడింగ్ డ్రైవింగ్‌ను తేలిక చేస్తుంది. మీరు మీ కుటుంబం కోసం ఫీచర్లతో ఉన్న, సురక్షితమైన, పెద్ద SUV కొనాలనుకుంటే కియా సోరెంటో మీకు కొత్త ఆప్షన్‌గా నిలవొచ్చు.

ఈఎంఐ ఎంత చెల్లించాలి..

మీరు కనుక రూ.10,00,000 డౌన్ పేమెంట్ చేస్తే కనుక మిగతా 25.38 లక్షలకు కారు లోన్ ద్వారా ఫైనాన్స్ తీసుకోవాలి. 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే 9.5 శాతం వడ్డీతో 72 నెలలపాటు EMI రూ. 46,393 చెల్లించాలి. మొత్తం వడ్డీ రూ.8,01,617 అవుతుంది.

ఒకవేళ 5 ఏళ్లకు లోన్ తీసుకుంటే 60 నెలలపాటు మీరు EMI రూ. 53,316 కడుతూ ఉండాలి. 4 ఏళ్లకు లోన్ తీసుకుంటే 48 నెలలపాటు మీరు EMI రూపంలో రూ.63,779 కట్టాలి. ఈ నాలుగేళ్లలో మీరు వడ్డీ రూ.5,22,713 కడతారు. లోన్ టర్మ్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది, అదే సయమంలో వడ్డీ పెరుగుతుంది.

Also Read: 2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?

సోరెంటోలో స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్

కియా సోరెంటో ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా మోడ్రన్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. ముందు భాగంలో కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్, నిలువు ఆకారంలోని LED హెడ్‌లైట్లు ఇచ్చారు. కార్ పొడవు, పదునైన కట్స్ దాని సైడ్ ప్రొఫైల్‌ను స్పోర్టీగా మారుస్తాయి. అదనంగా ఇందులో 19 ఇంచుల ప్రీమియం క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో నిలువు టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. మొత్తం డిజైన్ పరంగా చూస్తే, రోడ్డుపై వెళ్తున్నప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

హైటెక్ ఫీచర్లు

 కార్ కేబిన్‌లో లగ్జరీ, ఫ్యూచరిస్టిక్ అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే, డాష్‌బోర్డ్‌పై 12.3-ఇంచ్‌ల రెండు పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే కోసం ఉంటాయి. AI వాయిస్ అసిస్టెంట్, వెంటిలేటెడ్ పవర్డ్ సీట్లు, పానోరామిక్ సన్‌రూఫ్, డిజిటల్ కీ, పవర్డ్ టెయిల్‌గేట్,360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో ఉంది. 6-సీటర్ మోడల్‌లో రెండో వరుసలో ఆర్మ్‌రెస్ట్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన కెప్టెన్ సీట్లు కూడా లభిస్తాయి.

2 ఇంజిన్ ఆప్షన్లు 

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కియా సోరెంటో వినియోగదారులకు 2 ఆప్షన్లు ఇస్తుంది. మొదటిది 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్, ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి బెస్ట్ పవర్, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇస్తుంది.

రెండోది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కాగా, ఇది 193 bhp పవర్, 442 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హైబ్రిడ్, డీజిల్ రెండూ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ వస్తుంది. ఇందులో వేర్వేరు డ్రైవింగ్, టెరైన్ మోడ్‌లు (స్నో, మడ్, సాండ్) ఉన్నాయి. అన్ని రకాల రోడ్లపై సులువుగా దూసుకెళ్తుంది. 

Also Read: రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!

వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్

భద్రత పరంగా కియా సోరెంటో చాలా పవర్‌ఫుల్.. ఇందులో ఏకంగా 10 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్ 2+ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

దాదాపు 28 లక్షల రూపాయల ప్రారంభ ధరలో హైబ్రిడ్ టెక్నాలజీ, ఆల్-వీల్ డ్రైవ్, 3-రో సీటింగ్ కలయిక దీన్ని తన సెగ్మెంట్‌లో చాలా పోటీగా మారుస్తుంది. టయోటా ఫార్చ్యూనర్ లేదా స్కోడా కోడియాక్‌కు బదులుగా కొత్త టెక్నాలజీతో, ఎక్కువ మైలేజ్‌ ఆప్షన్ కోరుకునే వినియోగదారులకు ఇది పర్ఫెక్ట్ చాయిస్‌గా నిలవనుంది.

 

Frequently Asked Questions

కియా సోరెంటో ప్రారంభ ధర ఎంత?

కియా సోరెంటో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 27.99 లక్షలు. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ. 35,38,679 గా ఉంది.

కియా సోరెంటోలో లభించే ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

ఇందులో 12.3-అంగుళాల రెండు స్క్రీన్లు, AI వాయిస్ అసిస్టెంట్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 10 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2+ ADAS వ్యవస్థ ఉన్నాయి.

కియా సోరెంటోలో ఎన్ని ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

కియా సోరెంటో 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండింటిలోనూ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది.

కియా సోరెంటోలో సీటింగ్ కెపాసిటీ ఎంత, ఆల్-వీల్ డ్రైవ్ అందుబాటులో ఉందా?

ఈ కారు 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తుంది, ఇది అన్ని వాతావరణాలలో డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Embed widget