తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లను ఆస్వాదించాలనుకునే కొనుగోలుదారుల కోసం దీనిని తీసుకొచ్చారు. గతంలో టాప్-ఎండ్ మోడల్స్‌లో మాత్రమే లభించే ఫీచర్లను ఇప్పుడు తక్కువ ధరకే అందిస్తున్నారు.
రూ.1 లక్ష చెల్లించి Tata Sierra Legend కారు కొంటే, EMI ఎంత కట్టాలి
Tata Sierra Legend series EMI | టాటా మోటార్స్ టాటా సియెర్రా కొత్త లెజెండ్ సిరీస్‌ను లాంచ్ చేసింది. రూ. 11.9 లక్షల ప్రారంభ ధరలో లభించే కొత్త ఫీచర్లు మరియు వేరియంట్ల పూర్తి వివరాలను తెలుసుకోండి.

- టాటా సియెర్రా లెజెండ్ సిరీస్ ప్రీమియం ఫీచర్లను అందుబాటులో తెస్తోంది.
- తక్కువ ధరకే లగ్జరీ సౌకర్యాలు; ₹11.9 లక్షల నుంచి ప్రారంభం.
- వెంటిలేటెడ్ సీట్లు, 360 కెమెరా వంటివి దిగువ వేరియంట్లలో.
- ఇంజిన్ ఎంపికలలో మార్పు లేదు, మూడు ఆప్షన్లు అందుబాటులో.
భారత్‌లో టాటా వాహనాల హవా నడుస్తోంది. ఇప్పుడు కంపెనీ ప్రజాదరణ పొందిన SUV టాటా సియెర్రాను వాల్యూ ఫర్ మనీగా మార్చబోతోంది. కంపెనీ ఈ SUV కొత్త లెజెండ్ సిరీస్ ఎడిషన్‌ను తీసుకొస్తుంది. తక్కువ ధరకే ప్రీమియం, టాప్-ఎండ్ ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ఎక్కువ బడ్జెట్ లేక బేస్ లేదా మిడ్-వేరియంట్లను ఎంచుకుంటూ, ప్రీమియం లగ్జరీ ఫీచర్ల లోటును అనుభవించే కొనుగోలుదారులకు కొత్త అప్డేట్తో ప్రయోజనం చేకూరనుంది.
హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.9 లక్షల నుంచి ప్రారంభం కానుండగా, ఆన్ రోడ్ ధర రూ. 14.75 లక్షల వరకు ఉండనుంది ఇప్పుడు టాటా కేవలం రూ. 50,000 నుండి రూ. 70,000 వరకు మాత్రమే స్వల్ప ప్రీమియంతో ఈ SUVలో పలు ఫీచర్లను ఇస్తోంది. గతంలో కేవలం అత్యంత ఖరీదైన టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఈ ఫీచర్లు లభించేవి. ఈ కొత్త సిరీస్ కింద Smart+ L, Pure L, Pure L (O), Pure+ L, Adventure+ L వంటి కొత్త వేరియంట్లు తీసుకొస్తుంది.
చెల్లించాల్సిన ఈఎంఐ వివరాలు..
మీరు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా రూ. 13,75,000 (13.75 లక్షలు)ను ఫైనాన్స్, లోన్ తీసుకోవాలి. ఆ మొత్తంపై % వార్షిక వడ్డీ రేటు చొప్పున వేర్వేరు కాలపరిమితులకు చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ (EMI), వడ్డీ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు)కి గానూ మీరు నెలవారీ ఈఎంఐ ₹34,228 చెల్లించాలి. అయితే మొత్తం చెల్లించే వడ్డీ ₹2,67,954 అవుతుంది.
5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు)కిగానూ మీరు ఈఎంఐ 28,542 చెల్లించాలి. వడ్డీ మొత్తం ₹3,37,511 మేర చెల్లిస్తారు. దాంతో కారు కోసం మీరు చెల్లించే మొత్తం నగదు ₹17,12,511కు చేరుతుంది.
Also Read: లెవెల్ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?
6 ఏళ్ల కాలపరిమితి (72 నెలలు)కుగానూ నెలవారీ ఈఎంఐ ₹24,769 కాగా, మొత్తం చెల్లించే వడ్డీ 4,08,349 అవుతుంది. 7 ఏళ్ల కాలపరిమితి (84 నెలలు)కిగానూ నెలవారీ ఈఎంఐ ₹22,087 చెల్లించాలి. దాంతో మీరు మొత్తం చెల్లించే వడ్డీ ₹4,80,332 కాగా, కారు కోసం మొత్తం తిరిగి చెల్లించే సొమ్ము రూ. 18,55,332 (18.55 లక్షలు) అవుతుందని గ్రహించాలి.
తక్కువ ధరలోనే లగ్జరీ ఫీచర్లు
టాటా సియెర్రా లెజెండ్ సిరీస్ అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే, కంపెనీ ప్రీమియం ఫీచర్లను క్రింది వేరియంట్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కస్టమర్లు వెంటిలేటెడ్ సీట్లు, బాస్ మోడ్, థై సపోర్ట్ ఎక్స్టెన్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలను పొందడానికి టాప్ మోడల్ కొనాల్సిన పనిలేదు. ఈ అన్ని కంఫర్ట్ ఫీచర్లు ఇప్పుడు లోయర్, మిడ్-లెవల్ ట్రిమ్స్‌లో కూడా సులభంగా లభిస్తాయి. దీనివల్ల లాంగ్ జర్నీ చేసే వారికి తక్కువ బడ్జెట్లో కూడా లగ్జరీ కార్ ఫీల్ వస్తుంది.
బేస్ వేరియంట్లలో లభించనున్న లగ్జరీ ఫీచర్లు
సాధారణంగా వాహనాల బేస్, క్రింది వేరియంట్లు చాలా సాధారణంగా ఉంటాయి. కానీ టాటా సియెర్రా ఎంట్రీ-లెవల్ స్మార్ట్ ప్లస్ ఎల్ ట్రిమ్‌ను క చాలా ప్రత్యేకంగా మార్చింది. ఇందులో ఆటో-ఫోల్డింగ్ ORVMలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ప్రీమియం లెదరెట్ సీట్లు వంటి ఫీచర్లు ఇచ్చారు. దీని ప్యూర్ ఎల్ వేరియంట్లో కస్టమర్లకు 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా 8-స్పికర్ల పవర్ఫుల్ సౌండ్ సిస్టమ్ వసత్ాయి.
అడ్వెంచర్+ ఎల్లో లభించనున్న బెస్ట్ సేఫ్టీ
సియెర్రా కొత్త అడ్వెంచర్ ప్లస్ ఎల్ వేరియంట్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సేఫ్టీ కోరుకునే వారి కోసం డిజైన్ చేశారు. ఇందులో 360-డిగ్రీ కెమెరా, FAD డాంపర్లు కూల్డ్ గ్లోవ్ బాక్స్ లాంటి ఫీచర్లు ఇచ్చారు. టర్బో పెట్రోల్ ఇంజిన్ కోరుకునే వారికి ప్యూర్ ప్లస్ ఎల్ అత్యంత సులభమైన అందుబాటులో ఉండనుంది. తక్కువ ధరలో పవర్ఫుల్ టర్బో ఇంజిన్ కాంబినేషన్ ఈ వేరియంట్‌ను మరింత ప్రత్యేకం చేస్తుంది.
Also Read: రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
పవర్‌ట్రెయిన్‌లో మార్పు లేదు
ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, కంపెనీ దీని పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కార్ గతంలోలాగే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, పవర్ఫుల్ టర్బో పెట్రోల్ నమ్మకమైన డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
Frequently Asked Questions
టాటా సియెర్రా లెజెండ్ సిరీస్‌లో ప్రధాన ప్రత్యేకత ఏమిటి?
కొత్త టాటా సియెర్రా లెజెండ్ సిరీస్ ప్రారంభ ధర ఎంత?
హైదరాబాద్‌లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర రూ. 14.75 లక్షల వరకు ఉంటుంది.
టాటా సియెర్రా కొత్త సిరీస్‌లో తక్కువ వేరియంట్లలో లభించే కొన్ని లగ్జరీ ఫీచర్లు ఏమిటి?
వెంటిలేటెడ్ సీట్లు, బాస్ మోడ్, థై సపోర్ట్ ఎక్స్టెన్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇప్పుడు తక్కువ, మధ్య-స్థాయి వేరియంట్లలో కూడా లభిస్తాయి.
కొత్త సియెర్రా లెజెండ్ సిరీస్ ఇంజిన్‌లో మార్పులు ఏమైనా ఉన్నాయా?
లేదు, కంపెనీ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది గతంలో లాగే నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు























