రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
హ్యుందాయ్ బేయాన్ SUV క్రెటా కంటే తక్కువ ధరలో రానుంది. 1.5 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఎంపికలతో రూ.9 లక్షల నుంచి ధర ఉండొచ్చని అంచనా.

Hyundai’s upcoming midsize SUV Bayon: ఎస్యూవీ కొనాలనుకునే మిడిల్‌క్లాస్ కుటుంబాలకు హ్యుందాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. క్రెటా కంటే తక్కువ ధరలో మరో కొత్త SUVని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్‌కు బేయాన్ (Bayon) అనే పేరు పెట్టింది. వెన్యూ & క్రెటా మధ్యస్థాయిలో ఈ కారు ఉంటుంది. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు ఉండొచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది.
హ్యుందాయ్ వెబ్సైట్ ప్రకారం, బేయాన్ అనే పేరు ఫ్రాన్స్‌లోని బాస్క్ ప్రాంతంలోని ఓ నగరం నుంచి వచ్చింది. యూరప్‌లో ఇప్పటికే బేయాన్ పేరుతో ఒక కారు ఉంది. అయితే భారత్‌లో రానున్న మోడల్ దానికి భిన్నంగా ఉంటుంది. 4 మీటర్ల కంటే కొద్దిగా ఎక్కువ పొడవుతో ఈ SUV వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశ రోడ్లపై పరీక్షలు కూడా జరుగుతున్నాయి. పరీక్ష వాహనాలను బట్టి కారు డిజైన్‌పై కార్ మార్కెట్‌కు ఓ అంచనా వచ్చింది.
డిజైన్
ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కనిపిస్తుంది. పైభాగంలో వెడల్పుగా LED లైట్ బార్ ఉంటుంది. బంపర్‌పై ప్రధాన హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది. ఇది వెర్నా డిజైన్‌ను గుర్తు చేస్తుంది. మధ్యలో నంబర్ ప్లేట్ ఉంటుంది.
పక్క నుంచి చూస్తే కారు క్రాసోవర్ తరహాలో కనిపిస్తుంది. కిటికీల లైన్ పైకి ఎగబాకినట్లుగా ఉంటుంది. వెనుక భాగంలో C పిల్లర్ దగ్గర ప్రత్యేక ఆకృతి కనిపిస్తుంది. రూఫ్ రైల్స్, పెద్ద వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో కూడా సన్నని LED లైట్ బార్ ఉంటుంది. పైభాగంలో పెద్ద రూఫ్ స్పాయిలర్ ఉంటుంది.
ఇంటీరియర్
కారు లోపల కూడా ఆధునిక డిజైన్ ఉండనుంది. డ్యాష్‌బోర్డ్‌పై రెండు స్క్రీన్లతో కూడిన సెటప్ కనిపించింది. టాప్ వేరియంట్లో 12.3 అంగుళాల స్క్రీన్లు వచ్చే అవకాశం ఉంది. స్టీరింగ్‌పై హ్యుందాయ్ లోగోకు ప్రత్యేకమైన నాలుగు చుక్కల డిజైన్ ఉంటుంది. క్యాబిన్లో రెండు రంగుల థీమ్ ఉండొచ్చు. ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి లోటు ఉండదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి
ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే బేయాన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 115 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు CVT ఎంపిక కూడా ఉండొచ్చు.
ఈ కారులో CNG వెర్షన్ కూడా రావచ్చని సమాచారం. అలా జరిగితే నాలుగు మీటర్లకు పైగా పొడవున్న CNG కారును అందించే తొలి హ్యుందాయ్ మోడల్‌గా బేయాన్ నిలిచే అవకాశం ఉంది. CNG ట్యాంక్‌ను కారు కింద అమర్చే అవకాశం ఉంది.
ధర
ఈ SUVపై ధర అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. క్రెటా కంటే తక్కువ ధరకే బేయాన్‌ను తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
ప్రస్తుత పండుగ సీజన్లోనే ఈ కొత్త SUV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధర, ఆధునిక డిజైన్, ఎక్కువ ఫీచర్లు, పెట్రోల్ & CNG ఎంపికలతో బేయాన్కు మిడిల్‌క్లాస్ కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రూ.2 లక్షలు చెల్లించి Maruti Victoris CNG తీసుకుంటే చెల్లించాల్సిన EMI లెక్కలు ఇవే
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















