అన్వేషించండి

Maruti Fronx టాప్ మోడల్ ధర ఎంత.. డౌన్ పేమెంట్, EMI లెక్కలు తెలుసుకుని కొనండి

Maruti Fronx Top Model Price | మీరు మారుతి ఫ్రాంక్స్ టాప్ మోడల్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈఎంఐ (EMI), హైదరాబాద్‌లో కారు ధర వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా, మారుతి ఫ్రాంక్స్ మీ దృష్టిలో ఉన్నట్లయితే కొనేందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫ్రాంక్స్ దాని లుక్, ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్ల వల్ల కస్టమర్లను ఆకర్షిస్తోంది. అయితే మీరు టాప్ మోడల్ కొనాలనుకుంటే, దీని కోసం మీ నెలవారీ ఆదాయం ఎంత ఉండాలో తెలుసుకోవాలి. కారు కొనడం అంటే కేవలం దాని ధర చెల్లించడం కాదు. మీరు డౌన్ పేమెంట్, ప్రతి నెలా కట్టే EMI, మెయింటనెన్స్, సర్వీసింగ్ ఖర్చులను కూడా చెక్ చేసుకోవాలి. 

ఫ్రాంక్స్ టాప్ మోడల్ ధర

మారుతి ఫ్రాంక్స్ టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 12 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో Alpha Turbo DT AT (Petrol) టాప్ మోడల్ ధర రూ. 15 లక్షల వరకు ఉంది. కారు కొనేటప్పుడు మీరు కేవలం ఎక్స్-షోరూమ్ ధర చెల్లించరు. ఆ ధరతో పాటు ఆర్‌టీఓ,  ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఛార్జీలు కలుపుతారు. ఈ ఖర్చులన్నింటినీ కలిపిన తర్వాత కారు ఆన్-రోడ్ ధర సుమారు పదిహేను లక్షల వరకు ఉండవచ్చు. అయితే, మీ రాష్ట్రం, నగరాన్ని బట్టి ఈ ధర కొద్దిగా ఎక్కువ లేదా తక్కువ కావచ్చు.

డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి?

కారు ఆన్-రోడ్ ధర రూ. 15 లక్షలు ఉండి, మీరు సుమారు 20 శాతం డబ్బు చెల్లిస్తే, దాదాపు రూ. 3 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. సుమారు రూ. 12 లక్షల లోన్ తీసుకోవాలి. బ్యాంక్ లోన్ మీ సంపాదన, క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

4 సంవత్సరాల వ్యవధి (48 నెలలు): నెలవారీ ఈఎంఐ కాస్త ఎక్కువగా ఉంటుంది. 30,158 ఉన్నప్పటికీ, వడ్డీ భారం అత్యంత తక్కువగా ఉంటుంది. 

5 సంవత్సరాల వ్యవధి (60 నెలలు): చాలామంది వాహన కొనుగోలుదారులు ఇదే టైం ఎంచుకుంటారు. నెలవారీ ఈఎంఐ 25,202 చెల్లించాలి. వడ్డీ ₹3.12 లక్షలు అయినప్పటికీ, ఈఎంఐ భారం మరీ ఎక్కువ అనిపించదు.

6 సంవత్సరాల వ్యవధి (72 నెలలు): నెలవారీ ఈఎంఐ రూ. 21,921 కట్టాలి. ఇందులోనూ మీరు చెల్లించే వడ్డీ పెరుగుతుంది. 

Also Read: టాటా నుంచి మరో కొత్త సెడాన్‌.. Tigor ప్లేస్‌లోకి Aeris.. ఇవే హైలైట్స్‌! 

కారు ఫీచర్లు..

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Alpha Turbo DT AT) టాప్ మోడల్ 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పాడిల్ షిఫ్టర్లతో వస్తుంది. బయట డ్యూయల్-టోన్ లుక్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇస్తారు. క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, హెడ్ అప్ డిస్‌ప్లే (HUD), అర్కమిస్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS ఫీచర్లు ఇచ్చారు.

కారు ఇతర ఖర్చులు

మారుతి ఫ్రాంక్స్ కారు కొన్న తర్వాత ప్రతి నెలా కేవలం ఈఎంఐ కడితే సరిపోదు. పెట్రోల్ ఖర్చు, కారు సర్వీసింగ్, మెయింటనెన్స్ ఖర్చవుతుంది. పెట్రోల్, కారు ఇతర ఖర్చులకు ప్రతి నెలా సుమారు రూ. 8 నుండి 10 వేల వరకు ఖర్చవుతుందనుకుంటే, ఈఎంఐతో కలిపి కారు నెలవారీ మొత్తం రూ. 31 నుండి 33 వేల వరకు ఖర్చులు అవుతాయి. 

Also Read: ఎంత జీతం ఉంటే Maruti Celerio కొనవచ్చు? ప్రతినెలా EMI ఎంత చెల్లించాలి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget