అన్వేషించండి

Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం

Bank Employees Strike Postponed |యూ బ్యాంకింగ్ వినియోగదారులకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని, బ్యాంక్ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మూడురోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది.
  • ఐదు రోజుల పని దినాలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది.
  • సీనియర్ అధికారుల ప్రోత్సాహకాల, ఇతర పెండింగ్ సమస్యలపైనా చర్చలు జరగనున్నాయి.

Bank Employees Strike Deferred | న్యూఢిల్లీ: బ్యాంక్ ఎంప్లాయిస్ సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. సోమవారం, మంగళ , బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యునైటెడ్ ఫొరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆదివారం రాత్రి ప్రకటించింది. శనివారం సెలవుపై UFBU - ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కలిసి ఉన్నతస్ధాయి కమిటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. ఆ కమిటి నిర్ణయం తరువాత సమ్మెపై తదుపరి కార్యాచరణ ఉంటుందని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ స్పష్టంచేశాయి. దాంతో సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా వేసుకోవడంతో సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. 

కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్లు 3 రోజుల సేవల అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తో జరిగిన  చర్చల అనంతరం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) తమ దేశవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది. UFBU విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో బ్యాంక్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం ఇరువర్గాలు కొన్ని కీలక నిర్ణయాలకు అంగీకరించాయి. అన్ని శనివారాలను బ్యాంక్ సెలవులుగా ప్రకటించే (5 రోజుల వర్కింగ్) అంశాన్ని పరిశీలించేందుకు IBA, UFBU లతో కూడిన ఒక సంయుక్త కమిటీని తక్షణమే ఏర్పాటుకు అంగీకరించాయి. ఈ కమిటీ అన్ని అవకాశాలను అధ్యయనం చేసి, భాగస్వాములందరితో మాట్లాడి.. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది.

మరోవైపు స్కేల్ IV, అంతకంటే ఎక్కువ కేడర్ అధికారులకు వర్తించే PLI (పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్‌లో మార్పులు చేయడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియయేషన్ తో చర్చలు సైతం ప్రారంభం కానున్నాయి. తద్వారా వారి ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మార్చి 8, 2024 నాడు పేర్కొన్న ఇతర పెండింగ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించడంపై చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ఫలించడంతో తాత్కాలికంగా తమ నిరసనలు, సమ్మెను విరమిస్తున్నట్లు UFBU ఆదివారం రాత్రి ప్రకటించింది. 

"5 రోజుల బ్యాంకింగ్ సేవల డిమాండ్‌ను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు IBA అంగీకరించింది. ఈ కమిటీలో UFBU ప్రతినిధులకు అవకాశం కల్పిస్తాం. భాగస్వాములందరినీ సంప్రదించిన తర్వాత కమిటీ ఈ డిమాండ్‌పై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది" అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. 

నేటి నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె
అన్ని బ్యాంకుల్లో వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ అమలు చేయడంతో పాటు సీనియర్ అధికారుల నూతన ప్రోత్సాహక పథకంలో (ఇన్సెంటివ్ స్కీమ్) మార్పులు చేయాలన్న డిమాండ్లపై  బ్యాంక్ యూనియన్లు అతిపెద్ద సమ్మెకు వెళ్లాలని భావించాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఫైవ్ డే బ్యాంకింగ్‌ను సాధించుకోవడానికి బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఐబీఏతో జరిగిన చర్చల్లో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు ప్రస్తుతానికి శాంతించారు.

Frequently Asked Questions

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎందుకు వాయిదా పడింది?

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తో జరిగిన చర్చల అనంతరం యూనియన్లు తమ డిమాండ్లపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకరించడంతో సమ్మె వాయిదా పడింది.

బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

వారానికి 5 రోజుల పనిదినాలు (అన్ని శనివారాలు సెలవు) మరియు సీనియర్ అధికారుల ప్రోత్సాహక పథకంలో మార్పులు చేయడం వారి ప్రధాన డిమాండ్లు.

ఉద్యోగుల డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

5 రోజుల బ్యాంకింగ్, ఇతర పెండింగ్ సమస్యలను పరిశీలించడానికి IBA మరియు UFBU లతో కూడిన ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సమస్యలకు పరిష్కారం కనుగొంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget