దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ తన అచంచలమైన భక్తిని చాటుకుంటున్నారు అనంత్ అంబానీ. తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, సంప్రదాయబద్ధంగా తన తలనీలాలు సమర్పించి పరమ భక్తుడిగా నిలిచారు. అంతేకాకుండా టీటీడీకి రూ. 27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.