అన్వేషించండి

YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?

Mahua Moitra counters YS Jagan: సీఈసీ నియామక చట్టంపై జగన్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో చర్చ. పార్లమెంట్‌లో మద్దతిచ్చి ఇప్పుడు ప్రశ్నించడంపై మహువా కౌంటర్ ఇవ్వడం వైరల్ అయింది. ఇంతకీ జగన్ ఎటు వైపు?

Jagan Mohan Reddy political ideology clarity:   కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, సవరణ చట్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సోషల్ మీడియాలో చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్నే రేపింది.  పరీక్ష రాసే విద్యార్థే ఎగ్జామినర్‌ను నియమించుకున్నట్లుగా ప్రభుత్వమే సీఈసీని ఎంచుకోవడం ఏంటి " అని జగన్ లేవనెత్తిన ప్రశ్న సహేతుకమైనదే అయినప్పటికీ, దానికి ఆయన ఎంచుకున్న సమయం, గతంలో ఆయన పార్టీ తీసుకున్న పార్లమెంటరీ నిర్ణయాలు ఆయన రాజకీయ విధానాలను ప్రశ్నించేలా చేస్తున్నాయి.  నిన్నటివరకు కేంద్ర చట్టాలకు సభలో మద్దతు పలికి, ఇప్పుడు విమర్శలకు దిగడంపై జాతీయ విపక్షాలు జగన్ మోహన్ రెడ్డిని  ద్వంద్వ నీతి  ప్రదర్శిస్తున్నారన్న విమర్శలకు కారణం అవుతున్నాయి. 

నేరుగా ప్రశ్నించిన మహువా మొయిత్రా

ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్  ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా సోషల్ మీడియా వేదికగా జగన్‌కు నేరుగానే ఘాటు కౌంటర్ ఇచ్చారు.  వ్యవస్థలను ధ్వంసం చేసే వారికి ముందు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వడం ఆపండి.. ఆ తర్వాత గ్యాలరీ సమాధానాల కోసం మాట్లాడండి అంటూ ఆమె నేరుగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి  ని తప్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ మద్దతు పలికిన విషయాన్ని, కనీసం వాకౌట్ కూడా చేయకపోవడాన్ని ఈ సందర్భంగా జాతీయ నేతలు గుర్తు చేస్తున్నారు.

బీజేపీకి ఏకపక్ష సపోర్టు 

వైఎస్ జగన్ రాజకీయ విధానంలో  అనుసరిస్తున్న అంశాల వారీ మద్దతు  వ్యూహమే ఆయనను డిఫెన్స్‌లో పడేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీకి దాదాపు ప్రతి కీలక బిల్లు  ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, ఢిల్లీ సర్వీసెస్ బిల్లు, ఈసీ నియామక బిల్లు ముందస్తుగా మద్దతు పలికి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అవే నిర్ణయాలను తప్పుపట్టడం వల్ల ఆయన రాజకీయ విశ్వసనీయత దెబ్బతింటోంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి బీజేపీ విధానాలను మొదటి నుంచీ సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తుంటే, జగన్ మాత్రం సొంత రాష్ట్రాభివృద్ధి లేదా ఇతర సమీకరణాల పేరుతో కేంద్రానికి సహకరించారు. అయితే ఇప్పుడు ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత, ఎన్నికల కమిషన్ తీరుపై సొంతంగా అనుమానాలు వచ్చినప్పుడు మాత్రమే గళం విప్పడం వల్ల, జాతీయ విపక్షాలు ఆయనను  సులభమైన రాజకీయ అవకాశవాది గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం లేదా పొలిటికల్ ఐడియాలజీ లేకపోవడం వల్లనే ఆయన తీరుపై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి.

బీజేపీని వ్యతిరేకించాలంటున్న విపక్షాలు

ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటివి జగన్ వైఖరిని ఎండగడుతున్నాయి.  ముందు పాలసీ ప్రకారం రాజకీయాలు చేయండి.. బీజేపీ తెచ్చే ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లులను పార్లమెంట్‌లో ఓడించకుండా మద్దతు ఇచ్చి, తీరా నష్టం జరిగిన తర్వాత రోడ్డెక్కి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు  అని ఆయా పార్టీలు హెచ్చరిస్తున్నాయి. కేంద్రంతో వైఎస్సార్‌సీపీకి ఉన్న లోపాయికారీ అవగాహన వల్లే వారు ఇలా సగం దూరంలో ఆగిపోతున్నారనే ప్రచారం   వ్యాపిస్తోంది. ఈ పరిణామాలు జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు , జాతీయ ఇమేజ్‌కు పెద్ద పరీక్షగా మారాయి. మారుతున్న రాజకీయాల్లో  మధ్యస్థ వైఖరి, అవకాశవాద మద్దతు పనిచేయదని, ఏదో ఒక వైపు స్పష్టమైన స్టాండ్ తీసుకోవాల్సిందేనని ఈ వివాదం స్పష్టం చేస్తోంది. మరి ఇప్పటికైనా జగన్ తన జాతీయ రాజకీయ విధానంపై స్పష్టత తెచ్చుకుంటారో లేదా ఇలాగే  డబుల్ గేమ్  విమర్శలను ఎదుర్కొంటూ సాగుతారో వేచి చూడాలి.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress InCharge: మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep- ఇంతకీ ఎవరీయన
మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep నియామకం- ఇంతకీ ఎవరీయన
UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
AP Investment Protection Act: పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
Bharat Summit Controversy: హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget