అన్వేషించండి

who is BIhar next CM after Nitish: నితీష్ తర్వాత బీహార్ సీఎం ఎవరు? - రేసులో ముగ్గురు కీలక నేతలు!

BIhar next CM: బీహార్ కు కొత్త సీఎం రాబోతున్నారు. ఇరవై ఏళ్ల పాటు సీఎంగా ఉన్న నితీష్.. ఇక రాజ్యసభకు వెళ్తున్నారు. కొత్త సీఎం ఎవరన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

who is BIhar next CM: పదే పదే రాజీనామా చేస్తూ పదిసార్లు బీహార్ సీఎం  గా ప్రమాణస్వీకారం చేసిన రాజకీయ దురంధరుడు నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎంగా రాజీనామా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభకు వెల్లబోతున్నట్టుగా కూడా నితీష్ చెప్పేసారు. రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞత చెప్తూ, రాబోయో కొత్త ప్రభుత్వానికి తన పూర్తి మద్దతూ, సహకారం వుంటుందని చెప్పారు.

రాజకీయాల్లోకి రాకముందునుంచీ బీహార్ చట్టసభలో రెండు సభలకూ, పార్లమెంటులో కూడా ఎగువ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించాలని తనకు కోరిక ఉందనీ ఇప్పుడది నెరవేరబోతోందని కూడా చెప్పేశారు. ఇప్పటికే నితీష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి గా పనిచేసినప్పుడు లోక్సభనుంచే ప్రాతినిధ్యం వహించారు. బీహార్ అసెంబ్లీ, ఎగువ సభ సభ్యుడుగా కూడా ప్రాతినిధ్యం వహించారు.

ఇప్పుడు అందరి ఆసక్తీ నితీష్ తరువాత బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే. బీహార్ రాజకీయాల్లో నితీష్ తనదైన ముద్రవేశారు. తనకు ముందు లాలూ సీఎంగా వున్న సమయంలో జంగిల్ రాజ్ గా పేరుపడ్డ బీహార్ ను నితీష్ గాడిన పెట్టే ప్రయత్నం చేసారు. అభివృద్ది మంత్రంతో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మిత్ర పక్షంగా, ఎన్డీయే భాగస్వామికి మొదట సీఎం గా కొనసాగిన నితీష్. పొత్తు ఏ పార్టీతో వున్నా సీఎం పీఠం మాత్రం తనకే దక్కేలా చూసుకున్నారు. గత రెండు శాసన సభల్లోనూ భిన్న పార్టీలతో పొత్తుతో పోటీచేసిన నితీష్ బలం ఒకసారి ఆర్జేడీకన్నా తక్కువగా వున్నా, ప్రస్తుతం బీజేపీ కన్నా తక్కువగా వున్నా సీఎం పదవి మాత్రం తనదే అనిపించుకున్నారు.

ఎట్టకేలకు బీజేపీకి బీహార్ సీఎం పదవి ..

243 స్ధానాలున్న ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 202 స్ధానాలుండగా అందులో మెజారిటీ (89) బీజేపీనే దక్కించుకోగా నితీష్ పార్టీ జేడీయూ 85 స్ధానాలే దక్కించుకుంది. ఐనప్పటికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా ముఖ్యమంత్రిగా నితీష్ నే అంగీకరించింది బీజేపీ. నితీష్ సీనియారిటీ, పాలనపై ఆయనకున్న పట్టు ఆయనకు కలిసొచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు నితీష్ రాజ్యసభకు వెల్తుండటతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారన్న అంచనాలున్నాయి. మరి బీహార్ కి సీఎంగా ఎవరొస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నితీష్ తప్ప ఆయన పార్టీలో మరో నేత పేరు సీఎం పదవికి వినిపించట్లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమారుడు నిషాంత్ కి మంత్రి వర్గంలో చోటివ్వొచ్చన్న చర్చ జరుగుతోంది.

సీఎం ల రేసులో పలువురు. ..

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ శకం ముగుస్తుండగా ఇప్పుడు ఆయన స్థానంలో బీజేపీ నేత బీహార్ సీఎంగా నియమితులయ్యే అవకాశం ఉంది. బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో పదవసారి ప్రమాణ స్వీకారం చేయగా.. సామ్రాట్ చౌదరి మరియు విజయ్ కుమార్ సిన్హా వరుసగా రెండవసారి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

బీహార్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లేదా బీహార్ మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ ముఖ్యమంత్రి రేసులో వున్నారు.సామ్రాట్ చౌదరి సీనియర్ బిజెపి నాయకులలో ఒకరు. ఆయన బీహార్‌లో హోం శాఖ, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేయడంతో పాటు  రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నిత్యానంద్ రాయ్, ప్రస్తుతం  హోం కేంద్రంలో వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అంకుముందు బీహార్‌కు బిజెపి అధ్యక్షుడిగా, హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. దిలీప్ కుమార్ జైస్వాల్ మూడుసార్లు శాసనమండలి సభ్యడుగా అనుబవం తో పాటు రాష్ట్ర బిజెపి చీఫ్‌గా కూడా పనిచేశారు. దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా పేరు కూడా వినిపిస్తోంది.

ఐతే అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకువచ్చే సంప్రదాయమున్నబీజేపీలో ఈసారీ ఏమైనా జరగొచ్చనన్న గుసగులూ వినిపిస్తున్నాయి. ప్రస్తుత గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్ఘడ్ సీఎంల తెరపైకి వచ్చిన ఉదంతాలు ఉదహరణగా కూడా చేప్పుకుంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Starlink India Oligarchs: భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Maharashtra Bike Taxi EV: ఉబర్, ర్యాపిడో, ఓలా బైక్ టాక్సీలకు బిగ్ షాక్.. 100% ఈవీలుగా మార్చాలని అల్టిమేటం
ఉబర్, ర్యాపిడో, ఓలా బైక్ టాక్సీలకు బిగ్ షాక్.. 100% ఈవీలుగా మార్చాలని అల్టిమేటం
PM Modi 25 Years Office: నాపై దేశ ప్రజలకే ఎక్కువ హక్కు ఉంది... 25 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీ
నాపై దేశ ప్రజలకే ఎక్కువ హక్కు ఉంది... 25 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget