అన్వేషించండి

Hyderabad Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్.. ట్రాఫిక్ మళ్లింపు, ఆర్టీసి బస్సులకు సైతం ఆంక్షలు

Hyderabad Ganesh Nimajjanam | హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్దమైయ్యింది. భారీ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు తరలిరానున్న తరుణంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికిి సర్వసిద్దమైయ్యింది. అత్యంత వైభవంగా ఈ ఏడాది గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం నిర్వహించేందుకు ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ట్యాంక్ బండ్ వైపు భారీ గణేష్ విగ్రహాలు ర్యాలీగా రానున్న నేపధ్యంలో నగర వ్యాప్తంగా 6వ తేది ఉదయం 6గంటల నుండి 7వ తేది  ఉదయం 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. భారీ గణనాధుల శోభాయాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పక్కా ప్రాక్కా ప్లాన్ తో ప్రధాన రహాదారుల మీదుగా రూట్ మ్యాప్ సిద్దం చేశారు.

బాాలాపూర్ నుండి శోభాయాత్రగా బయలుదేరే బాలాపూర్ గణపతి విగ్రహం చార్మినాార్ , అబిడ్స్ ,లిబర్టీ , ట్యాంక్ బండ్ మీదుగా నక్సెల్స్ రోడ్ కు చేరుకుంటుంది. నక్సెల్స్ రోడ్ వద్ద హుస్సెన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తారు. సికింద్రాబాద్ నుండి హుస్సెస్ సాగర్ వైపు తరలి వచ్చే గణేష్ విగ్రహాలు ప్యాట్నీ , ప్యారడైజ్ , రాణిగంజ్,  కర్బలా మైదాన్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటాయి. ఎల్బీనగర్ మీదుగా వచ్చే గణపతి విగ్రహాలు దిల్ షుక్ నగర్ , అంబర్ పేట్, నారాయణ గూడ, ఉప్పల్ మీదుగా వచ్చి లిబర్టీ వద్ద శోభాయాత్రలో కలసి అక్కడి నుండి నేరుగా హుస్సెన్ సాగర్ వద్దకు చేరుకుంటాయి. టోలీ చౌకీ ,  మెహదీపట్నం మీదుగా వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం పాయింట్ వద్దకు చేరుకుంటాయి. ఆసీఫ్ నగర్ నుండి వచ్చే విగ్రహాలు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో కలుస్తాయి. 


Hyderabad Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్.. ట్రాఫిక్ మళ్లింపు, ఆర్టీసి బస్సులకు సైతం ఆంక్షలు

6వ తేది (శనివారం ) ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం 10గంటల వరకూ ఇతర వాహనాలను నగరంలో ప్రధాన రహదారులపైకి అనుమతించరు. 

సౌత్ జోన్ ఈస్ట్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు.. కేశవగిరి, చంద్రాయాణగుట్ట, మూసారాంబాగ్, చంచల్ గూడ

సౌత్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. ఆలియా బాద్, మదీనా, నయాపూర్ , ఎంజే మార్కెట్, దరుశ్శిఫా

ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. శివాజీ బ్రిడ్జి, పుత్లీబౌలీ, హిమాయత్ నగర్, వైఎంసిఎ

సెంట్రల్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. లిబర్టీ, అబిడ్స్ , ఖైరతాబాద్ , ట్యాంక్ బండ్ , బుద్దభవన్ 

నార్త్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. పాట్నీ, పారడైజ్, రాణిగంజ్ 

హుస్సేస్ సాగర్ వద్ద విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా వాహనాలు ట్యాంక్ బండ్ వద్దకు రానున్న నేపధ్యంలో ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాాలను కేటాయించారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ గుడి, పబ్లిక్  గార్డెన్స్,  బుద్దభవన్ వెనుక, ఆదర్శ నగర్ , బిఆర్ కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ ల వద్ద నిమజ్జనాకిి వచ్చే వాహనాల పార్కింక్ చేసుకోవచ్చు.

నిమజ్జనం పూర్తి చేసుకున్న తరువాత భారీ వాహనాలు, లారీలు నగరంలోకి రాకుండా  ,అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేలా దారిమళ్లించనున్నారు. 6వ తేది ఉదయం 8గంటల నుండి 11వతేది ఉదయం 11గంటల వరకూ లారీలకు నగరంలోకి అనుమతి లేదు. నిమజ్జన నేపధ్యంలో ఆర్టీసి బస్సులకు సైతం ఆంక్షలు తప్పలేదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమాయాల్లో ఆర్టీసి బస్సులను మెహదీపట్నం, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్ షుక్ నగర్ , నారాయణగూడ వరకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులను చాధర్ ఘట్ వైపు దారిమళ్లించనున్నారు. 

ఈ జంక్షన్ల వైపు నో ఎంట్రీ.. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్ , తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా..

విమానాశ్రయం వెళ్లేవారు పివిఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్  ఫ్లైఓవర్ లేదా అవుట్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్ , ప్యారడైజ్ రూట్ వాడుకోవాలి. ఇదిలా ఉంటే నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 10 బేబి పాండ్లు, పొర్టబుల్ వాటర్ ట్యాంక్ లు 8, ఎక్స్ వేషన్ పాండ్లు 8 ఏర్పాటు చేశారు. 

నిమజ్జనం సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు : 040- 27852482 , 8712660600 , 9010203626

 

టాప్ హెడ్ లైన్స్

Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget