ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి ఖర్చు, విశిష్టతలు ఇవే

ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేష్‌ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

విగ్రహాల రూపశిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ అనే కళాకారుడు 3 నెలలపాటు శ్రమించి ఖైరతాబాద్ గణేశుడిని తీర్చిదిద్దారు.

ఖైరతాబాద్‌లోని శ్రీవిశ్వశాంతి మహా గణపతి విగ్రహాన్ని 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు

ఖైరతాబాద్ బడా గణేషుడికి కుడివైపున శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున గజ్జలమ్మ (ఖైరతాబాద్‌ గ్రామదేవత) ఉన్నారు

కళ్లు, తిలకం దిద్దే కార్యక్రమం సోమవారం పూర్తి కావడంతో ఆగమన్‌ వేడుకను సైతం నిర్వహించారు

జూన్ 5న తయారీ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు బడా గణేష్ తయారీ, వేడుకలకు రూ.1.5 కోట్లకుపైగా ఖర్చయింది. పోలీసులు, వాలంటీర్లు, సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు

ఉత్సవ నిర్వాహకులతో పాటు 180 మంది కళాకారులు, కార్మికులు 81 రోజులకు పైగా శ్రమించి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సిద్ధం చేశారు.

బుధవారం ఉదయం 11 గంటల తరువాత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ గణేషుడికి తొలిపూజ చేశారు.