Adilabad Latest News: గణేష్ ఉత్సవాలలో మహిళలను వేధిస్తూ అడ్డంగా దొరికిన ఐదుగురు నిందితులు, కేసులు నమోదు
Adilabad Ganesh Immersion 2025 | నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చేలా డీజే ల ఏర్పాటు చేసిన 4 డీజే సిస్టమ్ లను పోలీసులు సీజ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలన్నారు ఇచ్చోడా సిఐ బండారి రాజు.

Vinayaka Chavithi 2025 | ఆదిలాబాద్: సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయాలని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ సిఐ బండారి రాజు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలకు అధిక్రమించి ఏర్పాటు చేసిన నాలుగు డీజీలను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్ల పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజే లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరేడుగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహిళలను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలపై కేసులు - ఆదిలాబాద్ షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ బి.సుశీల
ఆదిలాబాద్ జిల్లాలో మహిళల రక్షణ భద్రత ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ షీ టీం బృందం అప్రమత్తతతో ఉంటూ విధులు నిర్వర్తిస్తుందని షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ బి.సుశీల తెలియజేశారు. ముఖ్యంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో మహిళల వేధింపులను నియంత్రించడానికి షీ టీం బృందాలు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై తిరుగుతూ ఉంటారని ఈ సందర్భంలో గత రాత్రి ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి సతీష్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను తిలకించడానికి వేలాదిమంది ప్రజలు రాగా అందులో ఐదుగురు ఆకతాయిలు మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్ గా సంఘటనా స్థలంలో పట్టుబడ్డారని తెలిపారు.
నిందితుల వివరాలు
1) మయూర్,
2) సిద్దు.
3) కార్తీక్.
4) గణేష్
5) వినాయక్.
నిందితులు ప్రజలలో కలిసి తిరుగుతూ మహిళలపై వేధింపులు, వికృత చేష్టలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసమే ప్రత్యేకంగా షీ టీం బృందం అప్రమత్తతతో ఉంటుందని తెలిపారు. మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పట్టణంలో షీ టీం బృందం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉంటూ మహిళల భద్రతకై పాటుపడుతుందని తెలిపారు. మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 లేదా ఆదిలాబాద్ షీ టీం నెంబర్ 8712659953 నెంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు. ఆదిలాబాద్ షీ టీం అతివల రక్షణకై అహర్నిశలు పాటుపడుతుందని తెలిపారు. ఈ ఈ స్పెషల్ ఆపరేషన్ నందు షీ టీం బృంద సభ్యులు హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ, సిబ్బంది మహేష్, రోహిణి లావణ్య తదితరులు పాల్గొన్నారు.





















