Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
బాలగంగాధర తిలక్ 1893లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను స్వతంత్రోద్యమంలో సామూహిక, ప్రజల మధ్య ఐక్యత పెంచే వేదికలుగా మార్చారు. మొదట్లో ఈ ఉత్సవం కొన్ని సామాజిక వర్గాలకు, అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై ఉండేది. పైగా వాళ్ల ఇళ్ల లోపలే వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేవారు. తిలక్ ఈ పద్ధతిని మార్చారు. లంబోదరుడి ప్రతీ వర్గానికి దగ్గర చేసేలా బొజ్జ గణపయ్య ఉత్సవాలను బహిరంగంగా, పెద్ద పెద్ద పందిళ్లు వేసి ఊరు వాడా సంబంరంలా జరిగేలా చేశారు. తిలక్ గణేశుని "అడ్డంకులు తొలగించే దేవుడు"గా అంటే విఘ్నాలను రూపుమాపే శక్తిగా ప్రచారం నిర్వహించేవారు. స్వాతంత్య్ర సమరంలో ఐక్యతకు ప్రతీకగా ఈ ఉత్సవాన్ని మార్చి జాతీయోద్యమ స్ఫూర్తితో ప్రజలను ఏకం చేశారు. ఉత్సవాలలో దేశభక్తి గీతాలు, రాజకీయ సందేశాలు మిళితం చేసి, ప్రజాసంక్షేమం స్వతంత్ర సంగ్రామాలకు మద్దతుగా దీనిని ఉపయోగించారు. అయితే, తిలక్ మాత్రమే ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన వ్యక్తి కాకపోయినా, ఆయన గణేష్ ఉత్సవానికి సరికొత్త అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చారు అని మాత్రం చెప్పొచ్చు. నాటి నుంచి నేటి వరకూ ప్రతీ ఊరూ వాడా వినాయక చవితి వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే.





















