Dhanush D56 Movie : ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
Dhanush D56 : కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. D55 తర్వాత మరో బిగ్ మూవీ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా డ్రాగన్ బ్యూటీని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Rukmini Vasanth's May Be Heroine In Dhanush 56 Movie : కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తెలుగులో ఆయన లాస్ట్‌గా 'కుబేర'లో నటించారు. ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఇప్పటికే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ కాగా ఈ నెల 30 సినిమా థియేటర్లలోకి రానుంది.
ఆ తర్వాత 'అమరన్' ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతానికి 'D55' వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా... మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా కీలక రోల్ ప్లే చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ధనుష్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హీరోయిన్‌గా డ్రాగన్ బ్యూటీ
కొత్త ప్రాజెక్టుకు 'లబ్బర్ పండు' ఫేం డైరెక్టర్ తమిళరసన్ దర్శకత్వం వహించనున్నారు. 'D56' వర్కింగ్ టైటిల్‌తో పీరియాడికల్ ఫాంటసీ, పొలిటికల్ యాక్షన్ ఎపిక్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ 'రుక్మిణీ వసంత్' హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరి కాంబోలో రాబోతోన్న ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది.
గతేడాది కాంతార ప్రీక్వెల్‌తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ధనుష్ మూవీ సెట్స్‌లో పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
'D56' ప్రాజెక్టును డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు తెలుస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు టీం సాయి అభ్యంకర్, జీవీ ప్రకాష్ కుమార్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అలాగే, మూవీలో విలన్ రోల్‌లో 'ఉరియడి' ఫేం విజయ్ కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభం కానుంది.
ట్రెండింగ్ వార్తలు
























