Ganesh Laddu Auction: నిర్మల్ జిల్లాలో భారీ ధరకు గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం మహిళ
Ganesh Nimajjanam 2025 | నిర్మల్ జిల్లాలో వేలంలో పాల్గొని ఓ ముస్లిం మహిళ గణపతి లడ్డూను దక్కించుకున్నారు. భారీ ధర పాడటంపై స్థానికులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.

Ganesh Laddu Auction In Nirmal | నిర్మల్: గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లాలో మతసామరస్యం వెళ్లి విరిసింది. ఒ ముస్లిం మహిళ వేలంలో పాల్గొని హిందువులతో పోటీపడి మరీ వినాయకుని లడ్డూను దక్కించుకోవడంతో స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు. ఆమె తక్కువ ధరకు లడ్డూ దక్కించుకోలేదు. దాదాపు రెండు లక్షల రూపాయల వరకు వేలం పాడి గణేష్ లడ్డూను సొంతం చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శనివారం నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డును వేలం వేశారు. ఈ వేలంలో కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రిన్ 1,88,888 రూపాయలకు వేలంపాడి లడ్డూను దక్కించుకుంది. ఒక ముస్లిం మహిళ అయి ఉండి వినాయకుడి లడ్డును దక్కించుకున్నారు. వేలంలో లడ్డూ తాను సొంతం చేసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారీ ధరకు వేలంలో ముస్లిం మహిళ లడ్డూను సొంతం చేసుకోవడంపై స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో మహిళ హల్చల్ – కేసు నమోదు చేసిన నిర్మల్ పోలీసులు
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఐపీఎస్ హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా, నిజామాబాద్‌కు చెందిన నసీం బేగం అనే మహిళ బురఖా ధరించి హల్చల్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ పై నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు ఎవరైనా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.





















