అన్వేషించండి

PMFME Scheme Stree Nidhi Loans: డ్వాక్రా మహిళలకు 35 శాతం రాయితీతో రుణాలు.. పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!

PMFME Scheme Stree Nidhi Loans: స్త్రీ నిధి రుణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఎఫ్ఎంఈ 35 శాతం రాయితీని స్త్రీనిది రుణాలకు అందించాలని నిర్ణయించింది.

PMFME Scheme Stree Nidhi Loans: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్ధీకరణ (PMFME) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ స్కీమ్ కింద, మైక్రో సంస్థలు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆహార శుద్ధి పరిశ్రమలోని యంత్రాలను ఆధునీకరించుకోవడానికి, ఉత్పత్తిని మెరుగుపరచుకోవడానికి, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి వివిధ రాయితీలు, రుణాలు, గ్రాంట్ల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం ద్వారా పొందిన రుణాలపై 35 శాతం రాయితీ పొందవచ్చు.

పీఎంఎఫ్ఎంఈ రుణాలు స్త్రీనిధి ద్వారా 

పీఎంఎఫ్ఎంఈ స్కీమ్‌ ద్వారా డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద బ్యాంకు లోన్ అందక ఇబ్బందిపడే వారికి స్త్రీనిధి ద్వారా రుణాలు గ్రాంట్ చేయించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు వర్తించే 35 శాతం రాయితీని స్త్రీనిధి రుణాలకు వర్తింపజేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నిర్ణయంతో ఆహారశుద్ధి రంగంలో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే మహిళలకు ఊరట కలగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 5 వేల యూనిట్లకు ఈ రాయితీని వర్తింపజేసేందుకు కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించిన గైడ్లెన్స్ మరో వారంలో అధికారికంగా వెలువడనున్నాయి. 

Also Read: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!

35 శాతం రాయితీ 

పీఎంఎఫ్‌ఎంఈ స్కీమ్ కింద ఏర్పాటు చేసే ఆహారశుద్ధి యూనిట్లు 35 శాతం రాయితీతో రుణాలు మంజూరు చేయాలని కేంద్రం బ్యాంకులను కోరింది. అయితే ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నా.. బ్యాంకులు సకాలంలో రుణాలు అందించని పరిస్థితి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్‌ పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అందించే రుణాలకు పీఎంఎఫ్‌ఎంఈ పథకం రాయితీని అందించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. మహిళలు తమ జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకునే యూనిట్‌లో ప్లాంట్, యంత్రాలకు అయ్యే ఖర్చుపైన 35% రాయితీ అందించనున్నారు. మొత్తం యూనిట్‌కు అయ్యే ఖర్చులో లబ్ధిదారు వాటా 10 శాతంగా ఉంటుంది. రాయితీ, లబ్దిదారుడి వాటా పోనూ గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు స్త్రీనిధి ద్వారా రుణం అందించనున్నారు.  

Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!

పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ 

మైక్రో, స్మాల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం PMFME పథకం అమలు చేస్తుంది. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను మెరుగుపరచుకోవడానికి, లెటెస్ట్ టెక్నాలజీ అవలంబించడానికి, మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.  

PMFME పథకం అర్హతలు  

  • దరఖాస్తుదారుడు భారతదేశ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కలిగి ఉండాలి. ఇందులో వ్యక్తిగత వ్యాపారాలు, సహకార సంఘాలు, పార్టనర్ షిప్ వ్యాపారాలు ఉండవచ్చు. 

అవసరమైన డాక్యుమెంట్స్ 

  • ఆధార్ కార్డు
  • ఇ-మెయిల్ ఐడీ
  • మొబైల్ నంబర్
  • కరెంట్ బిల్లు
  • అడ్రస్ రుజువు
  • పాన్ కార్డ్ 

ఈ పథకం ప్రతి జిల్లాకు ఒక కీలక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడెక్ట్ విధానాన్ని అవలంబిస్తుంది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సేవలు, మార్కెటింగ్‌ను పెంచుకోవడానికి కేంద్ర ఊతం ఇస్తుంది. పరిశ్రమలలో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసుకునేందుకు యూనిట్‌కు రూ. 10 లక్షల గరిష్ట పరిమితితో 35% రాయితీతో రుణాలు అందిస్తారు. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!

PMFME స్కీమ్ కోసం ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి? 

Step 1: PMFME అధికారిక https://pmfme.mofpi.gov.in/pmfme వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.  

Step 2: హోమ్ పేజీలోని అప్లికెంట్ లాగిన్‌లో రిజిస్ట్రర్ చేసుకుని లాగిన్ అవ్వండి. 

Step 3: దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. దరఖాస్తు ఫారమ్‌లో మీ పేరు , ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి.

Step 4: మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ఫ్రూఫ్ సహా అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయండి.  

Step 5: అప్లికేషన్ ను సమీక్షించి, సబ్మిట్ చేయండి.  

Frequently Asked Questions

PMFME పథకం కింద రుణం పొందడానికి లబ్ధిదారుడి వాటా ఎంత ఉండాలి?

మొత్తం యూనిట్ ఖర్చులో లబ్ధిదారుడి వాటా 10 శాతంగా ఉంటుంది. మిగిలినది రాయితీ మరియు స్త్రీనిధి రుణం ద్వారా భర్తీ చేయబడుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
Prakash Raj Dharmasthala Case: ధర్మస్థల ఆలయంపై కుట్ర దారుల్లో ప్రకాష్ రాజ్ పేరు - హిందూత్వంపై ఇంత పగ ఎందుకని బీజేపీ నేత విష్ణు ప్రశ్న
ధర్మస్థల ఆలయంపై కుట్ర దారుల్లో ప్రకాష్ రాజ్ పేరు - హిందూత్వంపై ఇంత పగ ఎందుకని బీజేపీ నేత విష్ణు ప్రశ్న
Jnaneshwari Missing: ఏడో రోజూ లభ్యంకాని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ! పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి సెర్చ్ ఆపరేషన్! 
ఏడో రోజూ లభ్యంకాని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ! పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి సెర్చ్ ఆపరేషన్! 
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
Deva Katta: ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
Embed widget