ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలామంది దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్లు, గ్రాఫిక్స్ , పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఆధారపడుతున్నారు. అయితే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి మాత్రం ఏఐ సహాయం తీసుకోకుండా, పూర్తిగా మానవ మేధస్సు, స్వంత క్రియేటివిటీ , నేచురల్ టెక్నిక్స్తోనే సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కంటెంట్ బలమే నమ్ముతూ ఆయన సాగిస్తున్న ప్రయాణంపై సినీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.