అన్వేషించండి

Independence Day : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. స్కూల్ డెకరేషన్ కోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి

Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూళ్లను డెకరేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే. వీటిని ఫాలో అయితే మంచి లుక్ గ్యారెంటీ.

Independence Day Special Simple School Decoration Tips : ఆగస్టు 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతదేశం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వీధులు, ఆఫీసులు, స్కూల్స్ త్రివర్ణ రంగులతో నిండిపోనున్నాయి. దేశంలోని ప్రతి మూల కూడా దేశభక్తితో మార్మోగనుంది. జెండా ఎగురవేయడం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు.. ఎన్నో జరగనున్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా పాఠశాలలో ఈ సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పిల్లలే తమ స్కూల్ రెడీ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిలో భాగంగా తరగతి గదులు, కారిడార్లు, అసెంబ్లీ హాళ్లను అలంకరిస్తారు. సృజనాత్మకంగా స్కూల్​ని అలంకరించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో.. ఏ విధంగా డిజైన్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రవేశ ద్వారం, బులిటెన్ బోర్డులు

(Image Source: ABP LIVE AI)
(Image Source: ABP LIVE AI)

పాఠశాల గేటు వద్ద అలంకరణ ప్రారంభించాలి. ద్వారం దగ్గర.. ఆరెంజ్, తెలుపు, ఆకుపచ్చ బెలూన్లు, జెండాలు, బంతిపూల దండలను కట్టవచ్చు. బులిటెన్ బోర్డులను స్వాతంత్య్ర సమరయోధుల కోట్స్, స్వాతంత్య్రానికి సంబంధించిన ఫోటోలతో నింపవచ్చు. విద్యార్థులు తయారు చేసిన కాగితపు పావురాలు లేదా అశోక చక్రం వంటి 3D అంశాలను బోర్డులపై ఉంచితే.. లుక్ బాగుంటుంది.

DIY ఇండియన్ ఫ్లాగ్ వాల్

(Image Source: ABP LIVE AI)

(Image Source: ABP LIVE AI)

చార్ట్ పేపర్లు, హ్యాండ్ ప్రింట్స్ లేదా కాగితపు పువ్వులను ఉపయోగించి భారీ భారతీయ జెండాను తయారు చేయవచ్చు. జెండాలో కొంత భాగాన్ని ప్రతి తరగతి గదిలో అతికించవచ్చు. వివిధ రకాల ఫ్లవర్స్​ని కూడా వీటిలో భాగం చేయవచ్చు. ఐక్యతకు చిహ్నంగా ఇది నిలుస్తుంది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు.. స్వాతంత్య్ర స్ఫూర్తికి ప్రతిబింబం.

బెలూన్లు, రిబ్బన్లు

(Image Source: ABP LIVE AI)
(Image Source: ABP LIVE AI)

బెలూన్లు, రిబ్బన్లను సరిగ్గా అమరిస్తే చూసేందుకు ప్రభావవంతంగా ఉంటాయి. త్రివర్ణ రంగులు ఉన్న బెలూన్లను గుత్తులుగా కట్టి తరగతి గదుల తలుపులు, కారిడార్లు, అసెంబ్లీ స్టేజ్ వద్ద కట్టవచ్చు. లేదంటే పైకప్పుల నుంచి వేలాడదీయవచ్చు. కుర్చీలు, రెయిలింగ్‌లపై విల్లులుగా రిబ్బన్‌లతో కట్టవచ్చు. పర్యావరణకు అనుకూలమైన బెలూన్లను ఎంచుకుంటే మంచిది.

DIY పేపర్ క్రాఫ్ట్స్

(Image Source: ABP LIVE AI)

(Image Source: ABP LIVE AI)

పిన్‌వీల్స్, పేపర్ ఫ్యాన్స్, జెండాలు వంటి DIY పేపర్ క్రాఫ్ట్‌లు మనోహరమైన అలంకరణ కోసం మాత్రమే కాకుండా.. సరదాగా, విద్యాపరమైన కార్యాచరణను కూడా అందిస్తాయి. గాలి వీస్తున్నప్పుడు రంగురంగుల వైబ్‌ను ఎంజాయ్ చేయాలంటే.. విండోల దగ్గర, బాల్కనీలలో కూడా వీటిని వేలాడదీయండి. 

పువ్వులతో అలంకరణ

(Image Source: ABP LIVE AI)

(Image Source: ABP LIVE AI)

పువ్వులు ఉంటే చాలు అది ఏ అలంకరణ అయినా నిండుగా ఉంటుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీరు కూడా త్రివర్ణంలోని పూలను ఎంచుకోవచ్చు. కాషాయం కోసం బంతిపూలు, తెలుపు కోసం లిల్లీలు, ఆకుపచ్చ ఆకులతో జత చేసి చిన్న పుష్పగుచ్ఛాలను తయారు చేయవచ్చు. గాజు గ్లాసులలో లేదా ఫ్లవర్​వాజ్​లో వీటిని ప్లేస్ చేయడం వల్ల లుక్ బాగుంటుంది. వీటిని టేబుల్స్​పై పెట్టవచ్చు. ప్రవేశ ద్వారం దగ్గర ఉంటే.. తాజా, సువాసనతో రూమ్​ని ఆకట్టుకుంటుంది.

రంగోలి

(Image Source: ABP LIVE AI)
(Image Source: ABP LIVE AI)

సాంప్రదాయకంగా పండుగల సమయంలో రంగోలి ఉండాల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవానికి కూడా మీరు ఈ రంగోలిని ఎంచుకోవచ్చు. దీనిని రంగులతో లేదా పూలతో డిజైన్ చేయవచ్చు. ఇండియా మ్యాప్, అశోఖ చక్రం వంటివి వేస్తే చూసేందుకు మరింత అందంగా ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Dhandoraa OTT : ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget