మీ అల్పాహారంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో మృదువైన, మెత్తటి ఇడ్లీలు ట్రై చేయవచ్చు. దానికోసం క్యారెట్ ప్యూరీ, సాధారణ పిండి, పాలకూర ప్యూరీని రంగులుగా ఉపయోగించవచ్చు.
పిల్లలకు, పెద్దలకు తిరంగ శాండ్విచ్ బాగా నచ్చుతుంది. దీనికోసం మెత్తని తెలుపు బ్రెడ్ ముక్కలు మధ్యలో పుదీనా చట్నీ, చీజ్ స్ప్రెడ్, కెచప్ను వేసి ట్రై చేయవచ్చు. దీనిని త్వరగా, చేసుకోవచ్చు. పార్టీలలో స్పెషల్‌గా కనిపిస్తుంది.
మూడు రంగుల అన్నంతో లంచ్‌ను ట్రై చేయవచ్చు. క్యారెట్ మసాలా అన్నం, జీరా రైస్, పాలక్-పుదీనా రైస్ చేసి దానిని మీరు ట్రై కలర్లో ఉపయోగించవచ్చు.
పుల్లని టొమాటో సాస్, క్రీముతో కూడిన తెలుపు రంగు మయో లేదా ఆల్ఫ్రెడో, ఆకుపచ్చ రంగులో పేస్ట్ లేదా కొత్తిమీర చట్నీని తయారు చేసి.. వాటితో పాస్తా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో కలిపి దీనిని సర్వ్ చేసుకుంటే మీరు డిఫరెంట్ అనుభవాన్ని పొందవచ్చు.
గుజరాత్ స్పెషల్ ఢోక్లాను త్రివర్ణ రంగులో చేర్చుకోవచ్చు. కాషాయ రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగు ఢోక్లా పొరల కోసం క్యారెట్, సాధారణ, పాలకూరతో పిండిని తయారు చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించి.. ఆవాలు, కరివేపాకులతో తాలింపు వేసి, మసాలా చట్నీలతో తినేయొచ్చు.
పనీర్ ముక్కలను మూడు వేర్వేరు మిశ్రమాలలో ఊరబెట్టండి. రంగు కోసం కారం, క్రీమ్, పుదీనా లేదా కొత్తిమీరను ఉపయోగించండి. బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు గ్రిల్ లేదా బేక్ చేయండి.
తిరంగ ఫిర్నిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. రంగుల కోసం కేసర్, యాలకులుతో రంగులు ట్రై చేసి.. దానిని ఫిర్నీగా తయారు చేసుకోవ్చచు.
లేయర్డ్ కప్ కేక్‌లను స్వతంత్య్ర దినోత్సవం రోజు తయారు చేసుకోవచ్చు. వెనిలా పిండిని మూడు భాగాలుగా విభజించి.. సహజమైన ఆహార రంగులను కలపండి. వీటిని మీరు త్రివర్ణ రంగులతో డెకరేట్ చేయవచ్చు.
తిరంగ దోశను కూడా మీరు స్వాతంత్య్ర దినోత్సవం రోజు ట్రై చేయవచ్చు. దీనికోసం మీరు వెజిటేబుల్స్ ప్యూరీలను ఉపయోగించుకోవచ్చు.