రోజంతా అలసటగా ఉంటే ఈ విషయాలు ఫాలో అయిపోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

వ్యాయామం

రోజూ వ్యాయామం చేయాలి. ఎందుకంటే దినచర్యలో కదలిక ఉండాలి. ఇది మీరు యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

Image Source: Canva

చిన్న వ్యాయామాలు

సమయం తక్కువగా ఉన్నప్పుడు 10 నిమిషాల వేగంగా నడవడం లేదా కొన్ని పాటలు డాన్స్ చేయడం వంటివి ఎనర్జీ లెవెల్స్​ని పెంచుతాయి.

Image Source: Canva

నిద్ర

సరైన నిద్ర లేకుంటే రోజంతా అలసటగా ఉంటుంది. కాబట్టి సరైన నిద్ర ఉండేలా చూసుకోండి.

Image Source: Canva

స్లీపింగ్ షెడ్యూల్

ప్రతి రాత్రి నిద్రపోయే ముందు శరీరాన్ని త్వరగా నిద్రపోవడానికి సిద్ధం చేసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు, రిలాక్సింగ్ టెక్నిక్స్, చదవడం వంటివి చేయాలి.

Image Source: Canva

మధ్యాహ్న నిద్ర

మధ్యాహ్నం 3 గంటలలోపు ఇరవై నిమిషాలు కళ్లు మూసుకుని పడుకోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం చేసుకోవాలి. లేదా ధ్యానం చేయడం వల్ల రాత్రి నిద్రకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే అలసట తగ్గుతుంది.

Image Source: Canva

హైడ్రేషన్

రోజూ అంతా నీరు తాగుతూ ఉండాలి. హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఇది మీకు ఎనర్జీని ఇస్తుంది. నీరు కలిగిన పండ్లు, కూరగాయలు కూడా హైడ్రేటెడ్​గా ఉంచుతాయి.

Image Source: Canva

బ్యాలెన్స్డ్ డైట్

తక్కువ తినడం వల్ల శక్తి తగ్గిపోతుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు హెల్ప్ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. అధిక కేలరీలు ఉండేవి తీసుకోకపోవడమే మంచిది.

Image Source: Canva

కండరాల బలం

వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం మిమ్మల్ని బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఎక్కువ కాలం ఎనర్జిటిక్​గా ఉంటారు.

Image Source: Canva

ఆరోగ్యకరమైన ఫుడ్స్

క్యాన్డ్ బీన్స్ లేదా ఫ్రోజెన్ వెజిటబుల్స్ వంటి సౌకర్యవంతమైన వంటివి తీసుకోవాలి.

Image Source: Canva