పళ్లు పసుపుగా ఉండి ఇబ్బంది పడుతున్నారా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే అందానికి కూడా ముఖ్యమే.

Image Source: pexels

చాలా మంది ప్రతిరోజూ బ్రష్ చేసినప్పటికీ.. పళ్లు పసుపు రంగులో ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లోనే దాగి ఉందని మీకు తెలుసా!

Image Source: pexels

రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి. ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయండి.

Image Source: pexels

దంతాలను తెల్లగా ఉంచుకోవడానికి జెల్ లాంటి పేస్ట్ వాడటం మంచిది కాదు. కొంచెం గరుకుగా ఉండే పేస్ట్ ఎంచుకోండి.

Image Source: pexels

పసుపు పళ్లను శుభ్రం చేసుకోవడానికి కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేసుకోవచ్చు.

Image Source: pexels

ఈ పేస్ట్ బ్రష్‌లో వేసి తేలికగా ప్రతిరోజూ బ్రష్ చేస్తే దంతాల పసుపు రంగు మరకలు చాలా వరకు తొలగిపోతాయి.

Image Source: pexels

దంతాల మీద పసుపు మరకలు తొలగించడానికి.. స్ట్రాబెర్రీ, ఉప్పు కలిపి పేస్ట్ తయారుచేసి దంతాల మీద రుద్దవచ్చు.

Image Source: pexels

దంతాలను శుభ్రపరచడానికి కొబ్బరి నూనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దంతాలపై మరకలను తొలగిస్తుంది.

Image Source: pexels

కొబ్బరి నూనెను వేలితో తీసుకుని.. సున్నితంగా 10-15 నిమిషాల పాటు పళ్లపై శుభ్రం చేయండి. తరువాత నోరు శుభ్రం చేసుకుంటే మంచిది.

Image Source: pexels