మూత్రపిండాలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగిస్తాయి.



మూత్రపిండాల పనితీరులో సమస్యలు మొదలైతే.. అది శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది.



మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలు, అదనపు నీటిని తొలగించడంలో సహాయం చేస్తాయి.



కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం మీ కళ్ళపై కూడా పడవచ్చు.



కళ్ళ కింద వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే ఈ మార్పు తెలుస్తుంది.



కంటి రక్తనాళాలను దెబ్బతింటాయి. దీని వలన దృష్టి బలహీనపడవచ్చు.



కళ్ళలో మంట లేదా దురద ఉండవచ్చు.



కంటిలోని తెల్లటి భాగం లేత పసుపు రంగులోకి మారితే.. అది మూత్రపిండాలు, కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు.



కళ్లు పొడిబారడం, అసౌకర్యం కలగవచ్చు.