పండ్లు లేదా కూరగాయల విత్తనాలు చిన్నవిగా కనిపించినప్పటికీ.. చర్మ సౌందర్యాన్ని పెంచే పోషకాలతో నిండి ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: FREEPIK

గుమ్మడికాయ గింజలు ఈ జాబితాలో మొదట వస్తాయి. ఇందులో ఉండే స్క్వాలిన్ సూర్యరశ్మి నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.



గుమ్మడికాయ గింజల్లో ఉండే జింక్ కూడా చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: FREEPIK

చియాసిడ్స్​లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు మంటను తగ్గిస్తాయి.



చియా సీడ్స్​లోని యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని ముడతలు, గీతలు రాకుండా చేస్తాయి.

Image Source: FREEPIK

సన్​ఫ్లవర్ సీడ్స్​లలో కూడా విటమిన్ ఇ, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.

Image Source: FREEPIK

నువ్వులలో వృద్ధాప్యాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

Image Source: FREEPIK

అవిసె గింజలు మొటిమలను తగ్గించగలవు. చర్మానికి మెరుపునిస్తాయి.

Image Source: FREEPIK