Independence Day 2025 : ఆగస్టు 15, లాంగ్ వీకెండ్.. ట్రిప్ ప్లాన్ చేస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇండియాలోని ఈ ప్రదేశాలకు వెళ్లిపోండి
Independence Day : స్వాతంత్య్ర దినోత్సవం, లాంగ్ వీకెండ్ సందర్భంగా మీరు ఎటైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దేశ భక్తిని పెంచుకునేందుకు మీరు ఇండియాలోని ఈ ప్రదేశాలకు వెళ్లిపోండి.

Independence Day 2025 and long weekend Trip : ఈసారి ఆగస్టు 15 అదేనండి స్వాతంత్య్ర దినోత్సవం 2025 వీకెండ్ సమయంలో వచ్చింది. ఆగస్టు 15 శుక్రవారం. శని, ఆదివారం చాలామందికి ఆఫ్ ఉంటుంది. ఆ సమయంలో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే లాంగ్ వీకెండ్ అవుతుంది. ఈ స్పెషల్ వీక్ సందర్భంగా మీలోని దేశభక్తిని.. ట్రై కలర్ ట్రావెల్ స్టోరీగా మార్చుకోవాలనుకుంటే ఇదే బెస్ట్ సమయం. దేశభక్తి భావనను మరింత పెంచుకోవడానికి మీరు ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియాలోని ఈ ప్లేస్‌లకు వెళ్లిపోండి. ఇవి మీ ట్రావెల్ కోరికను తీర్చడమే కాకుండా.. దేశం గురించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడంలో హెల్ప్ చేస్తాయి.
మీరు కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున విహారయాత్రకు వెళ్లాలనుకుంటే.. ఈ ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లిపోండి. అక్కడ మీరు ఏమి చూడవచ్చో.. స్వాతంత్య్ర దినోత్సవానికి తగ్గట్లు ఈ ట్రిప్ ఎలా మెమరబుల్‌గా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం.
రాణి లక్ష్మీబాయి స్మారక చిహ్నం
మీరు ఆగస్ట్ 15కి ఉత్తర ప్రదేశ్ వెళ్తే.. అక్కడ మీరు ఝాన్సీకి వెళ్లవచ్చు. ఆగస్టు 15వ తేదీన రాణి లక్ష్మీబాయి స్మారక చిహ్నాన్ని సందర్శించవచ్చు. ఈ స్మారక చిహ్నం ఝాన్సీలో ఉంది. ఇది లక్ష్మీబాయి వీరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీరు దగ్గర్లోని ఝాన్సీ రాణి కోటను కూడా చూడవచ్చు.
విక్టోరియా మెమోరియల్
మీరు మీ కుటుంబంతో కలిసి కోల్‌కతా వెళ్లాలనుకున్నా కూడా మంచిదే. అక్కడ మీరు విక్టోరియా మెమోరియల్‌ను సందర్శించవచ్చు. ఇది బ్రిటిష్ పాలనను గుర్తు చేస్తుంది. భారతీయ చరిత్రలో దీనిని ఓ ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. అలాగే మీరు కోల్కత్తలో మరిన్ని ప్రదేశాలు కూడా చూడవచ్చు. ఇండియన్ మ్యూజియంను కూడా చూడవచ్చు. ఇది దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన వస్తువులను ఉంచే మ్యూజియం.
సబర్మతి ఆశ్రమం
మీరు మీ పిల్లలతో లేదా ఫ్రెండ్స్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఈ ఆశ్రమం మహాత్మా గాంధీకి చెందినది. ఇక్కడ నుంచే ఆయన క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం
మీరు ముంబై లేదా మహారాష్ట్ర వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఆగస్టు 15వ తేదీకి ఇదే బెస్ట్ అవుతుంది. మహారాష్ట్రలో ఉన్న రాజ్‌గఢ్ కోట ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రక కోట. ఇక్కడికి మీరు కుటుంబంతో కలిసి వెళ్లి రోజంతా గుర్తుండిపోయేలా గడపవచ్చు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం కూడా చూసేయొచ్చు.
శనివార్ వాడా
మీరు పూణే, మహారాష్ట్రలో శనివార్ వాడాను కూడా సందర్శించవచ్చు, ఇది మరాఠా సామ్రాజ్యానికి కేంద్రంగా ఉన్న పేష్వాల కోట. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు.. మీరు ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఇండియా గేట్, ఎర్రకోట వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇవన్నీ భారతదేశంలోని ప్రముఖమైన స్థలాలుగా పరిగణిస్తారు. ఈ ఆగస్టు 15న మీరు ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించవచ్చు.
మీరు ఫ్రెండ్స్‌తో వెళ్లినా.. ఫ్యామిలీతో వెళ్లినా దేశం గురించిన ఎన్నో విషయాల గురించి చర్చింవచ్చు. పిల్లలతో వెళ్తే వారికి మీ అనుభవాలు, అలాగే మీకు తెలిసిన విషయాలు చెప్పి.. వారికి నేరుగా వీటిని చూపిస్తే పిల్లలకి కూడా ఇది బెస్ట్ ట్రిప్ అవుతుంది.




















