Multibagger stock: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన మల్టీ బ్యాగర్ స్టాక్.. మీ నగదును రెట్టింపు చేసింది
Hindustan Copper Stock | హిందుస్థాన్ కాపర్ షేర్ ధర భారీగా పెరుగుతోంది. కాపర్ ధరల పెరుగుదలతో మైనింగ్ కంపెనీలకు లాభాలు వస్తున్నాయి. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తోంది.

Hindustan Copper Share | ట్రేడింగ్ సెషన్‌లో దలాల్ స్ట్రీట్ (D-Street)లో హిందుస్థాన్ కాపర్ షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రాగి ధరలు (Copper Price) రికార్డు స్థాయికి చేరడంతో షేర్లలో భారీ పెరుగుదల నమోదైంది. దీంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ 2025లో ఒక అద్భుతమైన మల్టీబ్యాగర్ స్టాక్‌గా అవతరించింది. 2025 ప్రారంభం నుండి నేటికి పోల్చి చూస్తే హిందూస్తాన్ కాపర్ స్టాక్ పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేసింది.
ఒక్క రోజులో దాదాపు 7 శాతం పెరిగిన ధర
BSEలో మంగళవారం హిందూస్తాన్ కాపర్ 6.62 శాతం పెరిగి 519.75 రూపాయల రోజువారీ గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరి వరకు తన బలాన్ని నిలుపుకుంటూ 6.35 శాతం పెరుగుదలతో 518.40 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. భారీ పెరుగుదలకు గ్లోబల్ స్థాయిలో కాపర్ ధరలలో పెరుగుదల, డిమాండే కారణం.
బుధవారం ఈ స్టాక్ వార్త రాసే సమయానికి నేడు 1.8 శాతం నష్టంతో 523 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే వారం రోజుల్లో చూస్తే హిందూస్తాన్ కాపర్ స్టాక్ 104 రూపాయలు పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విద్యుత్, భారీ మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఖర్చుల కారణంగా కాపర్ మెటల్ డిమాండ్ పెరగడంతో ధరలు అధిక స్థాయిలో పెరగి ఇది మల్టీ బ్యాగర్ స్టాక్‌గా మారింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధరలలో నిరంతర బలం హిందుస్థాన్ కాపర్‌తో సహా మైనింగ్, మెటల్ కంపెనీలకు ఆదాయ అవకాశాలను మెరుగుపరిచింది.
ఒక సంవత్సరం నుండి స్టాక్ ధర పెరుగుదల
గత సంవత్సరంలో ఈ స్టాక్ పనితీరు అద్భుతంగా ఉంది. BSE డేటా ప్రకారం, హిందుస్థాన్ కాపర్ షేర్లు ఏడాది నుండి (YTD) 100 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. 247.95 రూపాయల నుండి ఇప్పుడు రూ.518.40 స్థాయికి చేరుకున్నాయి. గత 5 రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 26 శాతం పెరిగింది. గత నెలలో ఇది 50 శాతం కంటే ఎక్కువ ధర పెరిగింది. గత ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు దాదాపు 85 శాతం రాబడిని ఇచ్చింది.
షేర్ కొనుగోలులో పోటీ
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హిందూస్తాన్ కాపర్ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులలో ఉన్న పోటీ, ఇంటర్నల్ కమోడిటీ ధరలలో వేగవంతమైన పెరుగుదల కారణంగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 30 జనవరి 2026 గడువుతో ఉన్న కాపర్ ఫ్యూచర్స్ 5.9 శాతం పెరిగి, రూ. 1306.05 ప్రతి కిలోగ్రామ్ రోజువారీ గరిష్ట స్థాయికి చేరుకుంది. Comexలో కాపర్ ఫ్యూచర్స్ 5.71 డాలర్లతో రోజువారీ గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరిగా 5.70 డాలర్ల ప్రతి పౌండ్ వద్ద ట్రేడ్ అవుతోంది.
పెట్టుబడిదారులు ఏం చేయాలి?
కాపర్‌కు లాంగ్ టర్మ్ లో సానుకూలంగా ఉన్నప్పటికీ, నిపుణులు అధిక స్థాయిలలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకే సెషన్‌లో వచ్చిన ఈ అద్భుతమైన పెరుగుదలతో కొంత లాభాల స్వీకరణను తోసిపుచ్చలేము. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ధరలు తగ్గితే స్టాక్‌పై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారు.
స్వల్పకాలిక వ్యాపారులకు ఊహించిన హెచ్చుతగ్గుల కారణంగా కఠినమైన స్టాప్ లాస్‌లను నిర్వహించాలని సలహా ఇస్తున్నారు. గ్లోబల్ కాపర్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లో మెటల్ స్టాక్స్‌పై ఉన్న క్రేజ్ కారణంగా హిందుస్థాన్ కాపర్‌పై అందరి దృష్టి ఉంది.
నిరాకరణ: (ఇక్కడ అందించిన విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయని గమనించాలి. పెట్టుబడిదారుడిగా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ABP Desam ఎవరికీ పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ సలహా ఇవ్వదు.)






















