అన్వేషించండి

Tollywood Flashback: హాలీవుడ్‌లో హాట్‌గా నటించిన ఇండియన్... తెలుగు సినిమాలో పెట్టేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాఘవేంద్ర రావు

ఓ హాలీవుడ్ సినిమాలో హాట్ హాట్ గా నటించినది ఓ ఇండియన్ హీరోయిన్. ఆ అమ్మాయిని తెలుగు సినిమాలో పెట్టేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు రాఘవేంద్ర రావు. ఆ అమ్మాయి ఎవరు? ఆ సినిమా ఏది? తెలుసుకోండి. 

దీప్తి భట్నాగర్... ఇప్పటి యూత్ కి పెద్దగా తెలియదేమో గానీ 90స్ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసిన హీరోయిన్ ఆమె. ఇండియన్ సినిమాల్లో గ్లామర్ డోస్ పరిధి దాటుతున్న కాలం అది. ఐశ్వర్య రాయ్, సుస్మిత సేన్ లాంటి సుందరీ మణులు, మోడల్స్ సినిమాల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్న కాలం అది. ఇండియన్ బ్యూటీస్ వరుసగా బ్యూటీ కాంటెస్ట్ ల్లో గెలుస్తుండడం తో హాలీవుడ్ డైరెక్టర్ లు వారిపై దృష్టి పెట్టడం మెదలుపెట్టారు. ఆ కోవలోనే వెలుగు లోకి వచ్చిన బ్యూటీ దీప్తి భట్నాగర్.

యూపీ నుండి హాలీవుడ్ వరకూ
యూపీలోని మీరట్ లో పుట్టిన దీప్తి 1990 నాటికి ముంబై చేరింది. మొదట్లో మోడల్ గా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసిన దీప్తికి ఇమ్మీడియట్ గా ఫేమ్ కలిసి వచ్చింది. Eve's వీక్లీ మ్యాగజైన్ మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొని విన్నర్ గా నిలిచింది దీప్తి. వెంటనే పెద్ద పెద్ద సంస్థలు సంప్రదించడం తో మోడలింగ్ కోసం సింగపూర్ లో స్థిరపడింది. ఆ సమయంలో దీప్తి, ఐశ్వర్య రాయ్ ల పేర్లు ఇండియన్ మోడల్ రంగాన్ని కుదిపేసాయి. 1995లో దీప్తిని "రామ్ శష్ట్ర" సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం చేశారు డైరెక్టర్ సంజయ్ గుప్తా. అదే సమయంలో హాలీవుడ్ లో వరుస బెట్టి యాక్షన్ సినిమాలు తీస్తున్న మాజీ టెన్నిస్ ప్లేయర్ అశోక్ అమృత్ రాజ్ కళ్ళల్లో పడింది దీప్తి. వెంటనే తాను అప్పటి యాక్షన్ స్థార్ డాన్ ది డ్రాగన్ విల్సన్ హీరో గా తీస్తున్న "ఇన్ఫెర్నో" (inferno) సినిమా కోసం దీప్తిని సెకండ్ హీరోయిన్ గా బుక్ చేశారు. ఇండియాలోనే తీస్తున్న ఆ సినిమా స్టిల్స్ చూసిన దర్శక దిగ్గజం k. రాఘవేంద్ర రావు తాను తీస్తున్న 'పెళ్ళి సందడి' కోసం దీప్తిని మెయిన్ లీడ్ గా తీసుకుని షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ లోపు 'ఇన్ఫెర్నో' షూటింగ్ లేట్ కావడంతో ముందుగా 'పెళ్లి సందడి' రిలీజ్ అయింది. 1996 సంక్రాంతికి రిలీజ్ అయిన 'పెళ్ళి సందడి' సూపర్ డూపర్ హిట్ అయింది. కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాయి. యంగ్ హీరోగా శ్రీకాంత్ ని  టాప్ లిస్ట్ లో పెడితే హీరోయిన్ లుగా దీప్తి, రవళి ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నారు. దీప్తి భట్నాగర్ అయితే రాత్రికి రాత్రి తెలుగు యువకుల కలల రాణి అయిపోయింది. చిన్న సినిమాగా కోటి పాతీక లక్షలతో  అశ్విని దత్, అల్లు అరవింద్ తీసిన ఈ సినిమా రాఘవేంద్ర రావు దర్శకత్వ ప్రతిభ, కీరవాణి మ్యూజిక్, దీప్తి అందాల పుణ్యమా అంటూ ఏకంగా 15 కోట్ల వరకూ సంపాదించింది. ఆ యేటి చిన్న సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ 'పెళ్లి సందడే '. పెద్ద సినిమాల్లో నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా ' మాత్రమే దీనికంటే ముందు ఉన్నా దాని బడ్జెట్ ఈ సినిమా తో పోలిస్తే ఎక్కువ. 'పెళ్లి సందడి ' హిట్ తో దీప్తి పేరు సౌత్ ఇండియా లో రీ సౌండ్ ఇస్తున్న సమయంలోనే దీప్తి నటించిన హాలీవుడ్ సినిమా ' ఇన్ఫెర్నో " (inferno ) రిలీజ్ అయి మరో రకం సంచలనం సృష్టించింది.

దీప్తి టూ మచ్ హాట్ అవతారం.. (Inferno )
1997 లో రిలీజ్ అయిన Inferno లో దీప్తి భట్నాగర్ మెయిన్ హీరోయిన్. ఆ సినిమా లో హీరో డాన్ ది డ్రాగన్ విల్సన్ తో ఒక సీన్లో రెచ్చిపోయి నటించింది ఆమె. ముఖ్యం గా జలపాతం లో తడుస్తూ ఉల్లిపొర లాంటి డ్రెస్ లో దీప్తి అందాలు అన్నీ బహిర్గతం అయ్యేలా ఆ రొమాంటిక్ సీన్ ని చిత్రీకరించాడు డైరెక్టర్ ఫ్రెడ్ రే. ఈ సీన్ అప్పట్లో చాలా సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా ను ఇండియా లో 'ఆపరేషన్ కోబ్రా' పేరుతో రీ రిలీజ్ కూడా చేశారు. మొత్తం ఇండియా లోనే తీసిన హాలీవుడ్ సినిమా గా పేరొందిన 'ఇన్ఫెర్నో "  బాగానే ఆడింది. ఇందులో చాలామంది ఇండియన్ నటులు యాక్ట్ చేశారు.వారిలో మాధవన్ కూడా ఉండడం విశేషం.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

సినిమా కంటే టీవీ రంగం వైపే ఇంట్రెస్ట్ చూపిన దీప్తి
వరుస హిట్లతో అటు హాలీవుడ్ లో ఇటు ఇండియన్ సినిమాల్లో దీప్తికి మంచి ఛాన్సులే వచ్చినా ఆమె ఎందుకో సినిమా రంగంఫై ఇంట్రెస్ట్ చూపలేదు. తెలుగులో నాగార్జున సరసన "ఆటో డ్రైవర్"లో హీరోయిన్ గా నటించిన దీప్తి  బాలయ్య సరసన "సుల్తాన్', రాజశేఖర్ సరసన 'మా అన్నయ్య', మోహన్ బాబు పక్కన "కొండవీటి సింహాసనం" లాంటి సినిమాల్లో కనిపించి 2007 తరువాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 2021లో రాఘవేంద్ర రావు కు జతగా "పెళ్ళి సందD "లో  ప్రత్యేక పాత్రలో తళుక్కున మెరిసింది. అయితే ఆమె టీవీ రంగం లో మాత్రం దూసుకు పోతోంది. "యాత్ర", "ముసాఫిర్ హు యారో" లాంటి ట్రావెల్ vlog ప్రోగ్రామ్స్ లో యాంకర్ కమ్  ప్రజెంటర్ గా కనిపిస్తూ వాటిని సూపర్ హిట్ చేసింది. తన చిరకాల ప్రియుడు ఆ టీవీ షోల డైరెక్టర్ రణదీప్ ఆర్య ను పెళ్ళి చేసుకుంది. వారికి శివ్, శుబ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆ దంపతులు ఇద్దరూ టీవీ రంగం లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కపుల్ అని పేరు తెచ్చుకుని హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మోడల్ నుండి హాలీవుడ్ వరకూ ఎదిగి సూపర్ హిట్స్ సాధించినా సినిమా తళుకుబెళుకుల్లో చిక్కుకు పోకుండా  నచ్చిన టీవీ రంగం లో సెటిల్ అయిన సెన్సేషనల్ బ్యూటీ దీప్తి భట్నాగర్

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget