Vizag Town Hall History: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ చరిత్ర | ABP Desam
హాయ్ ఫ్రెండ్స్, విశాఖ అంటే అందమైన బీచ్లే కాదు, అంతకంటే అద్భుతమైన పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా వాటికి తమదైన ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. వాటిలో ఒకటే వైజాగ్ టౌన్ హాల్. ఈ టౌన్ హాల్ కట్టి దాదాపు 110 ఏళ్లయింది. కానీ ఇప్పటికీ చెక్కుచెదరని స్థితిలో ఉంది. అంతకంటే దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ బిల్డింగ్ నుండే తొలిసారిగా మహాత్మా గాంధీ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్యోద్యమానికి పిలుపునిచ్చారు. మరి చరిత్ర ఉన్న టౌన్ హాల్ ని చూడకుండా వదిలేస్తామా?
హాయ్, నేను చెప్పిన టౌన్ హాల్ అయితే ఇదే, ఇక్కడే ఉంది. ప్రస్తుతం మనం ఆ టౌన్ హాల్ ముందు ఉన్నాము. ఎగ్జాక్ట్ గా అంతకుముందే ఈ బొబ్బిలి రాజులు చాలా వరకు కూడా అమౌంట్ ని కంట్రిబ్యూట్ చేశారు ఈ బిల్డింగ్ కట్టడానికి. ఆ డబ్బులతో దీన్ని కట్టారు. తర్వాత వైజాగ్ కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా అప్పట్లో ఇక్కడికి వస్తూ ఉండేవారు. ఆ తర్వాత స్వతంత్రోద్యమం ఉద్రృతంగా మారిన నేపథ్యంలో మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చారు. ఈ విదేశీ వస్త్ర బహిష్కరణకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం ఇక్కడే చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి, ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా ఆయన ఉత్తేజపరిచారు. తర్వాత ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న సమయంలో కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉద్దేశించి ఇక్కడ నుంచి ఆయన మాట్లాడారు. చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఉంది ఈ హాల్ అనేది. ఇప్పుడు కూడా ఎంతో అనుభవం ఉన్న ఒక సంస్థ కాపాడుతున్నారు, వాళ్ళందరూ ఆ వర్క్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న టౌన్ హాల్ అనేది ఇక్కడ ఉందని వైజాగ్ లోనే చాలామందికి, ఈ కొత్త తరం ఎవరైతే ఉన్నారో వాళ్లకైతే తెలియదు. అది రెండు గదులు, ఇది హాలు, అక్కడ పైకి వెళ్లడానికి దారి. అక్కడైతే ప్రస్తుతం ఈ కరెంట్ వర్క్ కి సంబంధించిన జనరేటర్లు అవన్నీ కూడా అక్కడే పెట్టారు. అలాగే మీటర్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇది మరొక గది. ప్రస్తుతం చాలా చక్కగా ఉంది మొత్తం. అసలు ఎంత ప్లానింగ్ అనేది ఒక 100 ఏళ్ల క్రితమే వేశారంటే నమ్మశక్యం కానిది. ఇది ఆఫీస్ గది.
ప్రస్తుతానికి ఈ పైన ఉన్నటువంటి ఈ దూలాలు గాని, అవి చూడొచ్చు, ఇవన్నీ కూడా ఒరిజినల్ వుడ్ అండ్ టేక్ వుడ్, అలాగే రోజ్ వుడ్ మిక్సింగ్ తో కట్టినవి. అందుకే ఎన్ని ఏళ్లైనా కూడా ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అద్భుతంగా ఉంది ఈ వేదిక అనేది. టౌన్ హాలు, ఆ బొబ్బిలి రాజా వారు శ్వేత చలపతి రంగారావు గారు, ఆయన క్వీన్ విక్టోరియా పేరు మీద, క్వీన్ విక్టోరియాకి అప్పుడు డైమండ్ జుబిలీ జరిగింది, ఆమెకి క్రౌన్ జరిగినప్పుడు ఆమె పేరు మీదుగా విశాఖపట్నం సిటీకి అని చెప్పి 1899 లోనే ఆయన ఒక ప్రపోజల్ పెట్టుకున్నాడు. టౌన్ హాల్లో ఆమె పేరు మీద కట్టివ్వాలని. ఇప్పుడున్న టౌన్ హాల్ దగ్గర ఫిషింగ్ విలేజ్ ఉండేది, చేపలు పట్టేవాళ్ళు ఉండేవారు. ఈ 1899 లో అది తీసుకొని అక్వైర్ చేసి, వాళ్ళని వేరే చోటకి పంపించారు. 1901 లో దీనికి శంకుస్థాపన చేశారు అక్కడ. అది కట్టడానికి కట్టిన తర్వాత అది నాలుగు సంవత్సరాలు పట్టింది.1904 లో దీన్ని ఓపెనింగ్ చేశారు. రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు, సి.వి. రామన్ గారు, రాధాకృష్ణ గారు వీళ్ళంతా అక్కడ వాళ్ళ ఫంక్షన్ లో టౌన్ హాల్లోనే జరుపుకున్నారు ఆ టైంలో. ఆ తర్వాత ఈ మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చాక, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి గాంధీ గారి దగ్గర నుంచి మనం సరస్వతి దేవి నాయుడు ఇంకా లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ, కాంగ్రెస్ లీడర్స్ అందరూ వాళ్ళు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా టౌన్ హాల్ దగ్గరే మీటింగ్ పెట్టేవారు, టౌన్ హాల్ లోపల కాకుండా ఎక్కువ జనమొస్తే టౌన్ హాల్ దగ్గర చాలా జాగా ఉండేది. ఇప్పుడంటే ఇది కానీ బీచ్ చాలా సముద్రం చాలా ముందుకు లోపలికి ఉండేది. ఆ బీచ్ అంతా ఖాళీ స్థలం ఉండేది. సో, ఆ బీచ్ లోనూ, దీని దగ్గర అక్కడ మీటింగ్లు పెట్టుకొని స్వతంత్ర పోరాటంలో వాళ్ళు చేస్తూ ఉండేవారు. గాంధీ గారు రెండు మూడు సార్లు వచ్చారు విశాఖపట్నం. వచ్చినప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టేవారు, జనం వచ్చేవాళ్ళు చాలామంది. అంత గొప్ప చరిత్ర ఉన్న టౌన్ హాల్ ఇది. మొన్నా మధ్యే రినవేట్ అయి, మళ్ళీ రెడీ అయ్యింది.





















