East India Company పాలన పోయి British Raj ఎలా వచ్చింది.? | Hyderabad | ABP Desam
హైదరాబాద్‌లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు, భారతదేశ పరిపాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ స్వాధీనం చేసుకోవడానికి లింక్ ఏంటో ఒక్క నిమిషంలో చెప్తాను, వినండి. 1857 మార్చిలో మంగళ్ పాండే భారక్‌పూర్‌లోని బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. అందుకు ప్రతీకారంగా ఏప్రిల్‌లో మంగళ్ పాండేని అరెస్ట్ చేసి ఉరితీశారు. ఇక అదే నెలలో మీరట్‌లోని సిపాయి ట్రూపర్లు ఎన్‌ఫీల్డ్ కాట్రిడ్జ్‌లు మేము వాడమని తిరస్కరించారు. బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు కూడా చేశారు. ఇది కేవలం మీరట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్ కోటీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై 50 మందితో తుర్రేబాజ్ ఖాన్ దాడి చేశారు. బేగం బజార్ మీదుగా కోఠీపై ఈ తిరుగుబాటు సాగింది. సిపాయిల తిరుగుబాటు సక్సెస్ఫుల్ కాకపోయినా, బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రం భయం మొదలైంది. భారతదేశంపై తమ ఆధిపత్యం దూరమవుతుందనే అనుమానంతో, అప్పటివరకు వ్యాపారం పేరుతో పాతుకుపోయిన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పరిపాలన హక్కులను బ్రిటిష్ క్రౌన్‌కు 1858 ఆగస్టు 2న స్వాధీనం అయ్యాయి.





















