Srikakulam లో స్వాతంత్ర సమరయోధులకు గుడి | ABP Desam
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సమరయోధులను శ్రీకాకుళంలోని గిరిజన ప్రాంతాల వారు పూజిస్తున్నారు. ఇది వెలగవాడలోని రామలింగేశ్వర ఆలయం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో, 1947 లోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ గిరిజన ప్రాంతంలో ఇది శివాలయంగా కాకుండా నాయకుల ఆలయంగానే ఖ్యాతి గడించింది. స్వాతంత్ర్య సమయంలో ఆలయ నిర్మాణం జరగడంతో గాంధీజీ, నెహ్రూ, నేతాజీ విగ్రహాలను ప్రతిష్టించారు. ఆగస్టు 15, జనవరి 26వ తారీఖులలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. శివుడికి ఇష్టమైన పండుగ రోజు, శివరాత్రి వంటి సందర్భాల్లో కూడా ఇక్కడ అశేషంగా తరలి వచ్చే భక్తులు ఈ నాయకులకు కూడా విశేషంగా పూజలు చేస్తారు. అప్పట్లో ఏంటంటే, స్వాతంత్ర్యం వచ్చే సమయం, అటు-ఇటు మధ్యలో ఆ సమయంలో కట్టినటువంటి గుడి కాబట్టి, ఊరి ప్రజలందరూ కూడా దేశ నాయకులను దేవుడితో సమానంగా భావించారు. దేవుడిని కొలిచినట్లుగానే జాతీయ నాయకులను గుండెల్లో పెట్టుకుని నేటికీ ఇక్కడి ప్రజలు స్వతంత్ర సమర యోధులను కొలుస్తూనే ఉన్నారు.





















