అన్వేషించండి

Madanapalle News: మదనపల్లె రేప్‌ కేసు నిందితుడికి దిక్కులేని చావు; చెత్త బండిలో కులవర్ధన్ అంతిమ యాత్ర, సమాజానికి గట్టి మెసేజ్ ఇచ్చిన కుటుంబం!

సాధారణంగా ఎవరైనా చనిపోతే శత్రువు అయినా వచ్చి కడసారి చూపు చూస్తారు. కానీ కులవర్ధన్ చేసిన పాపం అలాంటివి, అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కన్నతల్లి కానీ, ఇతర బంధువులు కానీ ముందుకు రాలేదు.

Madanapalle News: సభ్య సమాజం తలదించుకునేలా అఘాయిత్యానికి పాల్పడిన వారికి సమాజం ఎలాంటి శిక్ష విధిస్తుందో చెప్పడానికి మదనపల్లెలో జరిగిన ఈ ఘటనే ఒక గట్టి నిదర్శనం. హత్యాచారంతో అరాచకం సృష్టించిన మదనపల్లె రేపిస్టు కులవర్ధన్ అంతం అత్యంత దారుణంగా ముగిసింది. బతికి ఉన్నప్పుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఆ కామాంధుడికి, చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కలేదు. కన్నతల్లి, బంధువులు కూడా మొహం చాటేయడంతో అతని మృతదేహం అనాథగా మిగిలిపోయింది. చివరికి మున్సిపల్ సిబ్బంది చెత్త తరలించే బండిలో శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

కన్నవారే రాకుండా సందేశం 

సాధారణంగా ఎవరైనా చనిపోతే శత్రువు అయినా వచ్చి కడసారి చూపు చూస్తారు. కానీ కులవర్ధన్ చేసిన పాపాలు అలాంటివి, అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కన్నతల్లి కానీ, ఇతర బంధువులు కానీ ముందుకు రాలేదు. రక్తం పంచుకు పుట్టిన వారు కూడా అతని ముఖం చూడటానికి ఇష్టపడలేదంటే, అతను చేసిన నేరం ఎంత ఘోరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రి మార్చురీలో అతని శవం గంటల తరబడి పడి ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. సమాజం అతన్ని ఎంతగా అసహ్యించుకుంటుందో ఈ ఘటనతో స్పష్టమైంది. 

చెత్త బండిలో అంతిమ యాత్ర

చివరికి చేసేది లేక మున్సిపల్ సిబ్బందే కులవర్ధన్ అంత్యక్రియల బాధ్యత తీసుకున్నారు. అయితే అతనికి ఇచ్చే వీడ్కోలు కూడా ఒక గుణపాఠంలా ఉండాలని భావించారో ఏమో కానీ, సాధారణంగా శవాలను తీసుకెళ్లే వాహనంలో కాకుండా, పట్టణంలోని చెత్తను సేకరించే ఆటోలో మృతదేహాన్ని పడేశారు. కుళ్లిన చెత్తతో సమానంగా అతని శవాన్ని ఆటోలో వేసుకొని శ్మశానానికి తరలించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఆడపిల్లల ఉసురు తగిలితే ఇలా నే ఉంటుందని అంటున్నారు. 

సమాజానికి గట్టి మెసేజ్ 

ఈ ఘటన కేవలం ఒక అంత్యక్రియల విషయం మాత్రమే కాదు. ఇది ఒక గట్టి మెసేజ్. బాలికలు, మహిళల పట్ల హత్యాచారాలకు పాల్పడే కామాంధుల శవాలు సమాజానికి కేవలం చెత్తతో సమానమనే సంకేతాన్ని మున్సిపల్ సిబ్బంది ఈ చర్య ద్వారా పంపారని స్థానికులు అంటున్నారు. క్రూరమైన నేరాలకు పాల్పడే వాికి చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి మీద గౌరవం ఉండదని, వారికి ముగింపు ఇంతే దారుణంగా ఉంటుందని ఈ ఘటన నిరూపించింది. 

నేరం చేసిన వాడు చట్టం నుంచి తప్పంచుకోవచ్చేమోగానీ, ప్రకృతి ఇచ్చే శిక్ష నుంచి తప్పించుకోలేడని ఈ ఉదంతం చెబుతోంది. ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే ఏ మృగాడికైనా ఇదే గతి పడుతుందని ప్రజలు అంటున్నారు.  

Frequently Asked Questions

మదనపల్లెలో అఘాయిత్యం చేసిన కులవర్ధన్ కు ఎలాంటి అంత్యక్రియలు జరిగాయి?

కులవర్ధన్ మృతదేహాన్ని అతని తల్లి, బంధువులు ఎవరూ స్వీకరించలేదు. చివరికి మున్సిపల్ సిబ్బంది చెత్త తరలించే బండిలో అతని శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.

కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎందుకు ఎవరూ ముందుకు రాలేదు?

కులవర్ధన్ చేసిన ఘోరమైన నేరాల వల్ల అతని కన్నతల్లి, బంధువులు కూడా అతని ముఖం చూడటానికి ఇష్టపడలేదు. సమాజం అతన్ని ఎంతగా అసహ్యించుకుంటుందో ఇది తెలియజేస్తుంది.

చెత్త బండిలో శవాన్ని తీసుకెళ్లడం ద్వారా మున్సిపల్ సిబ్బంది ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు?

బాలికలు, మహిళలపై దారుణాలకు పాల్పడేవారి శవాలు సమాజానికి చెత్తతో సమానమని, క్రూరమైన నేరాలు చేసేవారికి చనిపోయిన తర్వాత కూడా గౌరవం ఉండదని ఈ చర్య ద్వారా మున్సిపల్ సిబ్బంది సందేశం ఇచ్చారు.

ఈ ఘటన నేరం చేసిన వారికి ఎలాంటి గుణపాఠం చెబుతుంది?

నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేకపోవచ్చు, కానీ ప్రకృతి ఇచ్చే శిక్ష నుంచి తప్పించుకోలేరని ఈ ఉదంతం చెబుతోంది. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లకు ఇదే గతి పడుతుందని ప్రజలు అంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget