Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
Jogi Ramesh Latest News:మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబం చిక్కుల్లో పడింది. ఆయన కుమారుడు రాజీవ్ భార్య మేఘన గృహహింస కేసు పెట్టారు.

Jogi Ramesh Latest News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు నమోదు అయ్యింది. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో జోగి రమేష్ కుటుంబ సభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు చేశారు. మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు.
జోగి రమేష్ కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదులో మొత్తం 11 మంది తనను హింసిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్, ఆయన భార్య జోగి శకుంతల, కుమారుడు జోగి రాజీవ్, ప్రియాంక, జోగి రమేష్ తమ్ముడు జోగి రాము, జోగు రాము కొడుకులు పండు, రాకేష్ ఉన్నారు.
326/26 నెంబర్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. కోడలి ఫిర్యాదుతో సెక్షన్ 85, 318,109 క్లాస్ వన్,420,318, 3&4 DP కింద కేసు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేఘనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపులు, మోసం, గృహహింస, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్‌ల కింద FIR ఫైల్ చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయసంహిత సెక్షన్లు, పాత ఐపీసీ సెక్షన్ల, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 85(పాత ఏపీసీ 498A) ప్రకారం వివాహిత అయిన మహిళను భర్త లేదా భర్త తరఫున బంధువులు శారీరకంగా లేదా మానసికంగా వేధించడం లేదా హింసించడం, కట్నం తెమ్మని ఒత్తిడి చేయడం, మానసిక క్షోభకు గురి చేయడం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఇది రుజువు అయితే మూడేళ్ల జైలు శిక్ష,జరిమానా విధించవచ్చు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 318/ ఐపీసీ సెక్షన్ 420 కేసులను ఒక వ్యక్తిని నమ్మించి మోసపూరితంగా వ్యవహరిస్తే పెడతారు. మోసపూరితంగా వారి వద్ద ఉన్న ఆస్తి, డబ్బు, విలువైన వస్తువులను దక్కించుకోవడం కూడా ఈ సెక్షన్ కిందకు వస్తుంది. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం, కట్నం, కానుకుల విషయంలో అబద్దపు వాగ్దానాలు చేసి మోసం చేసినప్పుడు ఈ సెక్షన్ నమోదు చేస్తారు. ఈ నేరం రుజువు అయితే ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా ఉంటుంది.
బీఎన్‌ఎస్ సెక్షన్ 109 క్లాజ్ 1 (పాత ఐపీసీ సెక్షన్ 307) ఒక వ్యక్తిని చంపాలనే స్పష్టమైన ఉద్దేశంతో లేదా ఆ దాడి వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని తెలిసి కూడా తీవ్రంగా దాడి చేయం , కొట్టడం లాంటివి సెక్షన్ కిందకు వస్తాయి. తీవ్రంగా గాయం కాకపోతే పదేళ్లు జైలు శిక్ష, జరిమానా, తీవ్రంగా పడితే జీవిత ఖైదు విధించే ఛాన్స్ ఉంది.
వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం పెళ్ల సంబంధంలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం, లేదా దానిని ప్రోత్సహించడం నేరం. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి బంధువుల నుంచి వరకట్నం కోసం డిమాండ్ చేయడం నేరం. మొదటి దానికి ఐదేళ్లు జైలు శిక్ష పదిహేను వేలు జరిమానా ఉంటుంది. లేదా కట్నం విలువ ఎంత ఉంటే అంత జరిమానా వేయవచ్చు. రెండో నేరానికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఎలాంటి వారెంట్ లేకుండానే విచారణ జరిపే హక్కు పోలీసులకు ఉంటుంది. ప్రత్యేకించి బీన్‌ఎస్ 109, 318 నాన్‌బెయిలబుల్ నేరాలు. పోలీస్ స్టేషన్‌లో బెయిల్ రాదు. కోర్టు ముందే బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఈ నేరాలను నేరుగా స్టేషన్ స్థాయిలోనే కాంప్రమైజ్ అవ్వడానికి వీలు ఉండదు.
ట్రెండింగ్ వార్తలు






















