ABP India At 2047 Summit: భారతదేశ డిజిటల్ విప్లవానికి నాయకత్వంవహిస్తున్న గ్రామీణ మహిళలు! పూర్తి వివరాలు ఇవే!
ABP India at 2047 Summit: 'డిజిటల్ డెమోక్రసీ' దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసింది. మారుమూల పల్లెల్లో కూడా కొత్త విప్లవం కనిపిస్తోంది.

ABP India at 2047 Summit: ఒకప్పుడు పొలాల్లో ప్రతి పనికి మ్యాన్‌పవర్‌ను వాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్లు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మంగళవారం జరిగిన ABP Live India@2047 సమ్మిట్‌లో సునీతా శర్మ చెప్పుకొచ్చారు. భారత్‌లో డిజిటల్ విప్లవానికి ఇదే ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు.
డ్రోన్‌ల వాడకం ఎరువుల పని తీరును మరింత పెంచిందని సునీతా శర్మ వివరించారు. "గతంలో, ఒక ఎకరం భూమిలో ఎరువులు చల్లడానికి ఐదు నుంచి ఆరుగురు కార్మికులు అవసరం. నేడు, ఒక డ్రోన్ అదే పనిని కేవలం ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది" అని ఆమె పేర్కొన్నారు.
శిక్షణా కేంద్రంలో మొదటిసారి డ్రోన్‌ను చూసినప్పుడు తనకు కలిగిన భయాలను శర్మ ఈ సందర్భంగా వివరించారు. దానిని ఆపరేట్ చేయగల సామర్థ్యంపై తనకు అనుమానం ఉండేదని, ముఖ్యంగా దాని ఆకారం తనను భయపెట్టిందని, ఇంతకు ముందు చిన్న డ్రోన్‌లను మాత్రమే చూశానని ఆమె అంగీకరించారు. అయితే, సరైన శిక్షణ, ఆమె శికణ ఇచ్చే వారి మద్దతుతో ఆమె చివరికి డ్రోన్‌ను విజయవంతంగా ఎగరడానికి అవసరమైన విశ్వాసం, నైపుణ్యాలను పొందారు.
ఆమె 15 రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత రెండు నెలలకు నమో డ్రోన్ పథకం ద్వారా సొంతంగా డ్రోన్ పొందారు. "టెక్ ఫర్ ఆల్: ది డిజిటల్ డెమోక్రసీ" అనే సెషన్‌లో జస్విందర్ కౌర్, సునీతా దేవి, దేవకీ దేవి, వైశాలిబెన్ గదియా, రమిలాబెన్ పర్మార్ తో కలిసి పాల్గొన్నారు. దేశంలోని ప్రతి మూలలోని ప్రజల జీవితాన్ని టెక్నాలజీ తనదైన రీతిలో ఎలా మార్చేసిందనే దానిపై ఈ సెషన్ దృష్టి పెట్టింది.
డ్రోన్ టెక్నాలజీతో ఉన్న తన అనుభవాన్ని పంచుకుంటూ, జస్విందర్ కౌర్ మాట్లాడారు, శిక్షణా కార్యక్రమంలో చేరడానికి ముందు తనను తాను ఒప్పించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆఆ పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు. అయితే, తన కొడుకు, భర్త ప్రోత్సాహంతో ఆమె ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఆమె నిబద్ధతతో శిక్షణను పూర్తి చేశారు. నేటికి 1,500 ఎకరాల భూమిలో విజయవంతంగా ఎరువులు చల్లారు.
సునీతా దేవి సౌరశక్తిని ఉపయోగించుకుంటూ నీటిని పంప్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె తోటి గ్రామస్తులకు వ్యవసాయ అవసరాల కోసం దానిని అమ్ముతున్నారు. మారిన టెక్నాలజీ ఆమెకు ఆదాయ వనరుగా మారింది. అంతేకాదు సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించి పెట్టింది.
సౌరశక్తితో సాగుతున్న తన ప్రయాణాన్ని పంచుకున్నారు దేవకీ దేవి, సౌరశక్తితో నడిచే బోర్‌వెల్‌ను ఏర్పాటు చేయడానికి నిధులను ఎలా ఏర్పాటు చేయగలిగారో వివరించారు. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె గ్రామంలోని ప్రజల నీటి అవసరాలను తీర్చడంతోపాటు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించగలిగారు.
రమిలాబెన్ పర్మార్ స్థానిక రైతులకు అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడం ద్వారా జరిగిన పరిణామాలను పంచుకున్నారు. చాలా మంది చిన్న తరహా రైతులు పూర్తిగా కొనుగోలు చేయలేని పరికరాలను అందించడం ద్వారా, వారి మొత్తం ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో, ఈ పనితో అద్దె వసూలు చేసి స్థిరమైన ఆదాయ వనరుగా మారిన విషయాన్ని వివరించారు.
బ్యాంకింగ్ రంగంలో తన శిక్షణ ఎలా స్థిరమైన ఆదాయ వనరుగా మారిందో వివరించే తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా వైశాలిబెన్ గదియా పంచుకున్నారు. తన నాలెడ్జ్, నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, ఆమె ఇప్పుడు తోటి గ్రామస్తులకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా పొందడంలో సహాయం చేస్తున్నారు.
2047 సమ్మిట్‌లో ABP ఇండియా గురించి
ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా, భారతదేశం పరివర్తన దశలో ఉంది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి సిద్ధంగా ఉంది. ఈ నిర్ణయాత్మక టైంలో ABP నెట్‌వర్క్ వినూత్న ఆలోచన నాయకత్వ శిఖరాగ్ర సమావేశం India@2047 పేరుతో నిర్వహిస్తోంది. ఈ శిఖరాగ్ర సమావేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశం, అంటే స్వాతంత్ర్య శతాబ్దాన్ని గుర్తుచేసే వికసిత్ భారత్ వైపుగా సాగేందుకు కావాల్సిన ఆలోచనలు అందిస్తోంది.




















