Amul MD Jayen Mehta: ఈ ఏడాది రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్ బ్రాండ్‌గా అమూల్- ఏబీపీ ఇండియా సమ్మిట్‌లో ఎండీ జయేన్ మెహతా
ABP Network India at 2047 | అమూల్ సంస్థకు రూ.100 వస్తే అందులో రూ.80 రైతుల జేబులోకి వెళ్తుందన్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా. ఏబీపీ సదస్సు ఇండియా@2047 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ABP News India at 2047 | న్యూఢిల్లీ: ఈ ఏడాది రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్‌ను సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు. వినియోగదారులలో బ్రాండ్ తెచ్చుకోవడంతో పాటు దానిని కాపాడుకుంటున్నామని చెప్పారు. అముల్ కంపెనీ ఎల్లప్పుడూ వినియోగదారుల నగదుకు తగిన విలువైన ఉత్పత్తులను అందించడంపై దృష్టి పెట్టిందని అన్నారు.
ఏబీపీ నెట్‌వర్క్ ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఇండియా@2047 సమ్మిట్‌లో అమూల్ ఎండీ జయేన్ మెహతా పాల్గొన్నారు. వారి సహకార విధానంలో రైతుల నుంచి పాల సేకరించేవారు. సహకార సంఘాలు నుంచి టోకు వ్యాపారులు, పంపిణీదారుల వరకు అన్ని వాటాదారులను కలిపి సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి. బ్రాండ్‌ను విజయవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
అమూల్ బ్రాండ్ రెండు మూల స్తంభాలపై ఆధారపడి ఉందని, ఒకరు రైతులు కాగా, మరో పిల్లర్ వినియోగదారులు అని జయేన్ మెహతా పేర్కొన్నారు. విజయాన్ని అందరికీ పంచడానికి తమ ఉత్పత్తులపై వినియోగదారులు ఖర్చు చేసిన డబ్బులో 80 శాతం మేర రైతులకు అమూల్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. మీరు అమూల్ ఉత్పత్తులకు ఒక రూ. 100 చెల్లిస్తే, రూ. 80 నేరుగా రైతులకు వెళుతుందన్నారు.
అముల్ 'పూర్తిగా సమగ్ర రైతు యాజమాన్య నిర్మాణం' నమూనాపై పనిచేస్తుందన్నారు. ఈ నమూనాను ఇతర రంగాలలో అమలు చేస్తే రైతులతో పాటు ఆఖరు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుందని సూచించారు. 5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ దృష్టిపై మాట్లాడుతూ.. మరో 3 నుంచి 5 సంవత్సరాలలో, 1 ట్రిలియన్ డాలర్లు సహకార రంగం నుంచి వస్తాయన్నారు. అమూల్ దీనిలో సగం ఉత్పత్తి చేస్తోంది, కానీ ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే సాధ్యమైనంత త్విరగా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.
ఏబీపీ ఇండియా@2047 గురించి
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మే 6న ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన సమ్మిట్, దేశీయంగా, ప్రపంచ వేదికపై భారత్ భవిష్యత్ కోసం చర్చిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. దేశం భవిష్యత్తు కోసం తమ లక్ష్యాలు, ఆలోచనలు పంచుకోనున్నారు. సమ్మిట్ చర్చలకు వేదికగా మాత్రమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో భారత్ విజయాలు, లక్ష్యాలు 2047కి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా దేశం ఉండాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.






















