అన్వేషించండి

భవిష్య భారతావనికి దిశా నిర్దేశం India@2047; ఏబీపీ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ

India@2047: శత వసంతాల వికసిత భారతావని లక్ష్యంగా ఏబీపీ నెట్‌వర్క్ కూడా ముందడుగు వేస్తోంది. India@ 2047 పేరుతో నిర్వహిస్తున్న సమ్మేళనానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా వస్తున్నారు.

India@2047 ABP Network's Summit: ఇంకో 22 ఏళ్లకి... నవ్య భారతావని స్వతంత్ర దేశంగా శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 1947లో స్వాతంత్రం పొంది వజ్రోత్సవాలు కూడా జరుపుకున్న భారతావని అనేక రంగాల్లో ప్రపంచ స్థాయిలో  నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా... విద్య, విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో మార్గదర్శిగా.. ప్రబల సైనిక శక్తిగా..భవిష్యత్ ఆర్థిక శక్తిగా భారత్‌ను ప్రపంచం కీర్తిస్తోంది. ఈ డెబ్బై ఏడేళ్ల కాలంలో ప్రజ్వలమైన శక్తిగా భారత్ నిలిచింది. అయితే స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే అత్యున్నత శక్తిగా భారత్ ఎదగాలనే సంకల్పాన్ని ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్నారు. శత వసంతాల నాటికి వికసిత భారతాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం అన్నిరంగాలకూ లక్ష్యాలను విధించారు. ఆ దిశగా దేశం పయనిస్తోంది. అందులో భాగంగానే.. మీడియా రంగంలో వందేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏబీపీ గ్రూప్.. శత వసంత భారతానికి స్వాగతం పలుకుతోంది.  ఏబీపీ నెట్‌వర్క్ మే 6వ  తేదీన ఢిల్లీలోని భారత మండపంలో India@2047  కాంక్లేవ్ ను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసాన్ని అందించనున్నారు.

INDIA@2047 ఏంటంటే..?
భారత్... ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటైన ఈ దేశం ఇప్పుడు చరిత్ర గమనంలో ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. సాంప్రదాయ, వారసత్వ విజ్ఞానంతో.. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ.. 2047 నాటికి శత వసంతాల స్వతంత్ర భారతావని వికసిత భారత్‌గా ఎదిగేందకు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళుతోంది.

ఈ స్ఫూర్తితోనే ABP Network India @ 2047 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ముఖ్యులు పాల్గొనే ఈ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్రమోదీ లీడ్ చేయనున్నారు.  దేశ, విదేశాలకు చెందిన విజనరీలు, పారిశ్రామిక దిగ్గజాలు, భవిష్యత్ నిర్దేశకులు ఈ సమ్మిట్‌లో  భారత భవిష్యత్‌ మార్గాన్ని ఆవిష్కరించనున్నారు.

India @ 2047 అనేక ఆలోచనల సమాహారం, కొత్త వ్యూహాలకు కార్యస్థానం, ఆధునిక భారతానికి పునాదులైన యువతకు మార్గనిర్దేశాన్ని అందించే కీలక సందేశం. ఇప్పటికే ప్రపంచ స్థాయి లక్ష్యాలతో ఉన్న 2047 రోడ్‌మ్యాప్‌పై మరింత స్పష్టంగా ఈ కాంక్లేవ్ చర్చించనుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే:  India 2047 అనేది దేశీయంగా గ్లోబల్ స్థాయిలో భారత భవిష్యత్‌ స్థానాన్ని నిర్దేశించడం కోసం ఒక స్పష్టమైన విజన్‌తో చర్చించే వేదిక.

ఇది సాధారణంగా జరిగే రాజకీయ, పారిశ్రామిక సమ్మేళనం కాదు. అంతే కాదు.. ఇది కేవలం భారత లీడర్లకు మాత్రమే పరిమితం అయింది కూడా కాదు.


భవిష్య భారతావనికి దిశా నిర్దేశం India@2047; ఏబీపీ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసం

భారత మండపంలో మే 6 వ తేదీన ఉదయం ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసంతో ముగుస్తుంది. My Vision @2047 | India Full Speed Ahead అనే థీమ్‌పై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఆయన కాకుండా రచయత, హిస్టారియన్ విక్రమ్ సంపత్, అంతర్జాతీయ టీవీ హోస్ట్ Bear Grylls, యాక్టర్ Aamir Khan,  Amul MD జయేన్ మెహతా, రేమాండ్స్ ఎండీ గౌతమ్ సింఘానియా, క్రికెటర్లు మిథాలీరాజ్, గౌతం గంభీర్ ఇంకా పలువురు వివిధ సెషన్లలో పాల్గొంటారు.


భవిష్య భారతావనికి దిశా నిర్దేశం India@2047; ఏబీపీ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ

ఈ సమ్మేళనం ఎందుకంటే…

India 2047  కేవలం ప్రసంగాలకు పరిమితమయ్యే వేదిక కాదు. దేశాన్ని భవిష్యత్ గమనం వైపు నడిపించే ఓ చోదక శక్తిగా ఉపయోగపడనుందని ABP NETWORK విశ్వసిస్తోంది.  రాబోయే కొన్నేళ్లలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను అత్యున్నత స్థాయిలో నిలపాలన్న లక్ష్యానికి  ఓ స్పష్టమైన రూపాన్ని అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget