Mammootty: మెగాస్టార్ ఇంట్లో ఉండొచ్చు... ఒక్క రాత్రి బస చేయడానికి ఎంత కట్టాలో తెలిస్తే ఫ్యూజులు అవుట్... బుకింగ్స్, రిజర్వేషన్ వివరాలు
Mammootty Home Stay: కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో ఉన్న మెగాస్టార్ మమ్ముట్టి ఇల్లు ఇప్పుడు సందర్శకులకు బస కోసం అందుబాటులో ఉంది. ఆ ఇంట్లో స్టే చేయాలంటే ఎంత పే చేయాలి, బుకింగ్స్ డీటెయిల్స్ తెలుసుకోండి

సెలబ్రిటీలు ధరించే బ్రాండెడ్ బట్టలు, యాక్సెసరీస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అలాంటి ట్రెండ్ ను ఫాలో అవ్వాలని కోరుకుంటారు అభిమానులు. ఇక వాళ్లు కొనే ఖరీదైన కార్లు, బైకులు వంటి వాటి ఖరీదు గురించి తరచుగా వార్తలు వింటూనే ఉంటాము. కానీ ఒక స్టార్ హీరో ఇంట్లో ఒక రోజు స్టే చేస్తే ఎలా ఉంటుంది అనే క్రేజీ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచన వచ్చినా వర్కౌట్ కాదు అనుకుంటారు చాలా మంది. పోనీ ఒక స్టార్ హిరో ఇల్లు లోపల ఎలా ఉంటుందో చూడాలని ఎప్పుడైనా అనుకున్నారా ? అనుకోకపోతే ఇప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మలయాళ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న మమ్ముట్టి ఇంట్లో స్టే చేసే అరుదైన అవకాశాన్ని పొందే ఛాన్స్ త్వరలోనే రాబోతోంది కాబట్టి.
మలయాళ మెగాస్టార్ ఇంట్లోకి అడుగు పెట్టే ఛాన్స్
అభిమాన హీరోని ఓ సెల్ఫీ తీసుకోవాలని ఎంతగానో ఆరాటపడతారు మూవీ లవర్స్. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక సూపర్ స్టార్ ఇంట్లో బస చేసే అవకాశం వస్తే, అది కచ్చితంగా అదృష్టం అనే చెప్పాలి. అయితే ఇది అందరు సూపర్ స్టార్లతో సాధ్యం కాకపోవచ్చు. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంట్లో బస చేసే అరుదైన అవకాశాన్ని తాజాగా కల్పిస్తున్నారు. నాలుగైదు దశాబ్దాల నుంచి మలయాళ ఇండస్ట్రీలో, భారతీయ సినిమా చరిత్రలో ఒక తిరుగులేని నటుడిగా దూసుకెళ్తున్న మమ్ముట్టి ఇంట్లో స్టే చేసే అవకాశం ఎలా లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో కేసి జోసెఫ్ రోడ్ లో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని ఇప్పుడు ఆయన అభిమానుల కోసం ఒక టూరిస్ట్ ప్లేస్ గా లేదా రిసార్ట్ గా మార్చబోతున్నారు. అక్కడ లగ్జరియస్ స్టే వసతులను అందిస్తున్నారు. నిజానికి తరచుగా మమ్ముట్టిని చూడాలని ఆశతో చాలామంది అభిమానులు అక్కడికి వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ ఇంటిని ఒక విజిటింగ్ ప్లేస్ గా మార్చి క్యాష్ చేసుకోబోతున్నారు. ఈ ఇల్లు మమ్ముట్టి తనకోసం స్వయంగా దగ్గరుండి, తన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్న ఒక బోటిక్ విల్లా.
ఒక్క రోజుకు ఎంత పే చేయాలంటే ?
ఈ అద్భుతమైన హౌస్ లో బస చేయాలి అనుకున్నవారు సంప్రదించాల్సిన నెంబర్లను కూడా ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. మాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ఇంట్లో స్టే చేయడానికి బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. నాలుగు బెడ్రూంల ఈ విల్లాలో ఒక్క రాత్రి స్టే చేయాలంటే రూ. 75000 ఖర్చు చేయాల్సిందే.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

