Directors Remunerations: దర్శక ధీరుడు రాజమౌళి స్ట్రాటజీ అదే - హిందీలో ఆమిర్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ కూడా..
Telugu Industry Remuneration Dynamics: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు, డైరెక్టర్లు కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు.

Telugu Directors Remuneration Strategy: రాజమౌళి (Rajamouli).. ఈ పేరు వింటేనే మనకు సక్సెస్ గుర్తొస్తుంది. అయితే, ఆయన సినిమాకు రెమ్యునరేషన్ ఎంత అనేది అందరిలోనూ ఓ ఆసక్తి ఉంటుంది. నిజం చెప్పాలంటే రాజమౌళి ఏ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోరు. భారీ బడ్జెట్ మూవీస్, పాన్ ఇండియా లెవల్ మూవీస్ వస్తున్న కొద్దీ తెలుగు ఇండస్ట్రీ డైనమిక్స్ మారుతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ అంతా న్యూ స్ట్రాటజీకి తెర తీశారు.
అందరిదీ అదే స్కూల్..
రాజమౌళి ఏ సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ తీసుకోకుండా మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ షేర్ మాత్రమే తీసుకుంటారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. భారీ బడ్జెట్స్ పెరుగుతున్న మూవీస్ పెరుగుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకుంటున్న కొద్దీ అటు హీరోలు కానీ ఇటు డైరెక్టర్లు కానీ కొత్త పంథాను తెరపైకి తీసుకొస్తున్నారు. రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్‌లో షేర్ కోరుకుంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్న క్రమంలో ప్రాఫిట్ షేరింగ్ అనేది కామన్‌గా మారే ఛాన్స్ ఉందని 'లూసిఫర్ 2' మూవీ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు చెప్పారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ఎక్కువ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్న క్రమంలో డైనమిక్స్ మారుతాయని.. అందరూ అదే బాటలో నడుస్తారనే టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్ నుంచి..
నిజానికి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) సైతం గత 20 ఏళ్లుగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కేవలం ప్రాఫిట్‌లో షేరింగ్ మాత్రమే తీసుకుంటానని అన్నారు. దీని వల్ల మూవీ బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మంచి స్క్రిప్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని.. నిర్మాతలకు సైతం ఎక్కువ భారం ఉండదని భావిస్తున్నారు. తన చాలా సినిమాలు రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తోనే పూర్తైనట్లు చెప్పారు.
మోహన్‌లాల్ కూడా..
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) సైతం తన లేటెస్ట్ మూవీ 'లూసిఫర్ 2: ఎంపురాన్'కు రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ విషయాన్ని దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్వయంగా తెలిపారు. తాను కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని అన్నారు. తమ రెమ్యునరేషన్లు సినిమా కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. తాను నిర్మాతల నుంచి తీసుకునే ప్రతీ రూపాయికి న్యాయం చేయాలని తాను భావిస్తానని అన్నారు.
హిట్ కొడితేనే రెమ్యునరేషన్..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సైతం 2023లో విడుదలైన 'సెల్ఫీ' సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సినిమా సక్సెస్ సాధిస్తేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని ఆయన చెప్పినట్లు పృథ్వీరాజ్ తాజా ఇంటర్వ్యూలో వివరించారు. అయితే, ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో నిర్మాతలు రూ.కోట్ల నష్టాన్ని చవిచూశారు.
మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిందేనా..
తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఈ పద్ధతి మొదలు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు చాలామంది టాలీవుడ్ టాప్ హీరోలు సైతం కథను నమ్మి సినిమా తీస్తున్నారు. అది సక్సెస్ అయితే డైరెక్ట్‌గా ప్రాఫిట్‌లో షేర్ తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఒక్కో సినిమాకు ఒక్కోలా రెమ్యునరేషన్ ఉంటుండగా.. ప్రాఫిట్ షేర్‌పైనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

