Prithviraj Sukumaran: 'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
L2 Empuraan Pre Release Event: 'లూసిఫర్ 2: ఎంపురాన్' తెలుగు వెర్షన్ చూడాలని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో రాజమౌళి, మహేష్ బాబు మూవీపైనా స్పందించారు.

Prithviraj Sukumaran Said Long Dailogue In SSMB29 Movie: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) లీడ్ రోల్‌లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన మూవీ 'లూసిఫర్ 2: ఎంపురాన్' (L2: Empuraan). ఈ నెల 27న మూవీ థియేటర్లలోకి రానుండగా.. తాజాగా మూవీ టీం శనివారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్, దిల్ రాజు పాల్గొన్నారు.
ఆ పెద్ద డైలాగ్ ఏంటో..?
ఈ సందర్భంగా తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పాలని యాంకర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను (Prithviraj Sukumaran) కోరగా.. తనకు తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చని.. అయితే ప్రస్తుతం ఆ మూవీ గురించి తాను మాట్లాడనని చెప్పారు. దీంతో ఆ డైలాగ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలోనిదేననే చర్చ మొదలైంది. ఈ సినిమాలో ఆయనకు భారీ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యానని.. అప్పటి నుంచి ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే దీనిపై టీమ్ నుంచి అప్ డేట్స్ రావాలని కోరుకుందామని అన్నారు.
Also Read: దర్శక ధీరుడు రాజమౌళి స్ట్రాటజీ అదే - హిందీలో ఆమిర్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ కూడా..
దానిలో గొప్పతనం ఏముంది..?
గతంలో ఈ సినిమాకు సంబంధించి లీక్ వీడియోపై పృథ్వీరాజ్ స్పందించారు. 'అలాంటి వీడియోలు చూడడానికి ఆడియన్స్ ఎందుకు ఉత్సాహం చూపిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందులో గొప్పతనం ఏముంది.?. అలా చూడడం వల్ల మీరు ఆసక్తిని కోల్పోతారు. బిగ్ స్క్రీన్‌పై ఆ సీన్ ఆస్వాదించలేరు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఏమీ మాట్లాడను.' అని అన్నారు.
'లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి'
లూసిఫర్ 2 తెలుగు వెర్షన్ చూడాలని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. 'ఏ డైరెక్టర్ అయినా తన సినిమా ఒరిజినల్ వెర్షన్‌ను చూడమని మాత్రమే చెబుతారు. తాను మాత్రం తెలుగు వెర్షన్ చూడాలని సలహా ఇస్తున్నాను. ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాను స్టూడియోలో కాకుండా రియల్ లొకేషన్స్‌లోనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. అదే నాకు సవాల్‌గా అనిపించింది. రెండేళ్లుగా మూవీ లొకేషన్స్ కోసం వెతికా. ఇందులో మీరు చూడనున్నవన్నీ రియల్ లొకేషన్సే. అదే నాకు ఛాలెంజింగ్ టాస్క్.' అని అన్నారు.
ఆ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నా..
'లూసిఫర్ 2: ఎంపురాన్' రిలీజ్ అయిన తర్వాత అసలు బడ్జెట్ కంటే మీరు ఎక్కువే అంచనా వేస్తారని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నట్లు చెప్పారు. 'బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా హిట్ అనేది ఎవరూ చెప్పలేరు. నేను బడ్జెట్ అనేది ఏదీ చూడను. మంచి సినిమానా కాదా అనే చూస్తాను. లూసిఫర్ 2 బడ్జెట్‌ను నేను ఎప్పుడూ ప్రకటించలేదు. బడ్జెట్‌ను దర్శక నిర్మాతలు ఎప్పుడూ నిర్ణయించరు. కంటెంట్ ఆధారంగా బడ్జెట్‌లో ఎక్కువ తక్కువ ఉంటాయి. మంచి కథ వస్తే తెలుగులోనూ కచ్చితంగా చేస్తాను.' అని పృథ్వీరాజ్ వెల్లడించారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'లూసిఫర్'కు సీక్వెల్‌గా 'లూసిఫర్ 2: ఎంపురాన్' రానుంది. ఈ మూవీని తెలుగులో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. 2019లో ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయలేకపోయామని.. ఇప్పుడు రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

