Morning Top News: ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, వైసీపీకి మాజీ ఐఏఎస్ రాజీనామా వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: కామారెడ్డిలో ఇంకా వీడని ఆత్మహత్యల మిస్టరీ, లైంగిక వేధింపుల కేసులో నటుడి అరెస్ట్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్
తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులలో ఈడీ పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌లకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లైంగిక వేధింపుల కేసులో నటుడి అరెస్ట్
తెలుగు బుల్లితెర వీక్షకులకు సుపరిచితుడైన టీవీ నటుడు చరిత్ బాలప్ప తనను లైంగికంగా వేధించారని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేశాడని చరిత్ బాలప్ప మీద అతని గర్ల్ ఫ్రెండ్ ఆరోపణలు చేసింది. అంతే కాదు... లైంగిక దాడి మాత్రమే కాదు, తన దగ్గర డబ్బులు సైతం దోచుకున్నాడనిఆరోపణలు చేసింది. గర్ల్ ఫ్రెండ్ ప్రయివేట్ ఫోటోలు, వీడియోలు అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చరిత్ బాలప్ప మీద ఆవిడ ఆరోపణలు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణ నేతల విమర్శలు... టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించక పోవడంపై కొద్ది రోజులుగా వస్తోన్న విమర్శలు టీటీడీ చెక్ పెట్టింది. స్వామి దర్శనానికి వారానికి రెండుసార్లు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. కొద్ది రోజులుగా తెలంగాణ నేతలు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తే తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కామారెడ్డిలో ఇంకా వీడని ఆత్మహత్యల మిస్టరీ
కామారెడ్డి జిల్లాలో ఇద్దరు పోలీసులు, ఓ కంప్యూటర్ ఆపరేటర్ మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే వీరి ఒంటిపై గాయాలున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. మృతదేహాల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. వీరి మరణాలకు ముందు ఎలాంటి గొడవ, దాడులు జరగలేదు. కేవలం నీటిలో మునగడం ద్వారా వారు చనిపోయారని నిర్ధారించారు డాక్టర్లు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లే వారి సౌలభ్యం కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనంగా ఈ స్పెషల్ బస్సులు నడుపుతామని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
యూనివర్సిటీలో వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో విద్యార్థినిపై వేధింపులు కలకలం రేపాయి. ఈ కేసులో ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాలలో మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్ విద్యార్థిని తిరిగి ప్రవేశం పొంది తరగతులకు హాజరవుతోంది. విద్యార్థిని పట్ల క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతి ఉమామహేశ్ తరగతి గదిలోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డయ్యాయి. ఒంటరిగా ఉన్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఉమామహేష్‌ను.. వర్శిటీ ఫ్లైఓవర్ వద్ద అరెస్ట్ చేసినట్లు తిరుపతి రూరల్ సీఐ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రెండు జిల్లాలను హడలెత్తిస్తున్న పెద్దపులి
మొన్నటివరకూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రెండు చోట్ల మనుషులపై దాడులు సైతం జరగగా, ఓ ఘటనలో వ్యక్తి మృతి చెందగా.. మరోచోట తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వెల్లి పరిశీలించి పులి సంచారం నిజమేనని తేల్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైసీపీకి మాజీ ఐఏఎస్ రాజీనామా
శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఇంతియాజ్.. సామాజిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. బంధువులు, మిత్రుల సలహా మేరకే వైసీపీకి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్రకు, అంతిమ సంస్కారాలకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌లో ఆయన అంత్యక్రియలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక తాజాగా స్మారకస్థలంపై కూడా కేంద్రం ఒక హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. దీనిపై మన్మోహన్ కుటుంబసభ్యులకు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రోహిత్ ఇదేం కెప్టెన్సీ.. ఇదేం అట
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ఆసీస్ టెయిలెండర్లను త్వరగా ఔట్ చేయడంలో విఫలమై ఏకంగా 175 పరుగులు సమర్పించుకోవడంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, రవి శాస్త్రి కూడా రోహిత్ కెప్టెన్సీ లోపాలపై చర్చించారు. సరైన సమయంలో బౌలర్లను మార్చడంలో రోహిత్ విఫలమయ్యాడని గావస్కర్ చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..