Doctor Wanted: కోట్ల జీతం, ఉండటానికి ఇల్లు, కారు కూడా ఇస్తారట - కానీ ఒక్క డాక్టర్ కూడా దొరకట్లేదు - ఎందుకో తెలుసా?
Australian town: నాలుగు లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు మూడున్నర కోట్లు జీతం ఇస్తామన్నా సరే ఆ ఊరికి డాక్టర్లు దొరకడం లేదు. అక్కడేమీ దెయ్యాలు ఉండవు. మరి ఎందుకంటే?

Viral News: ఆస్ట్రేలియాలో వైద్యులకు కొదవ లేదు. భారత్ లాంటి దేశాల నుంచి చాలా మంది వైద్యులు ఆస్ట్రేలియాకు వలసపోయి అక్కడ పనులు చేస్తున్నారు. అయితే అదే ఆస్ట్రేలియాలో ఓ ఊరుకి మాత్రం.. వైద్యుడు దొరకడం లేదు. కోట్ల జీతం ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇల్లు, కారు కూడా ఇస్తామని.. అంటున్నారు. అయినా తమ ఊరికి ఓ డాక్టర్ కావాలన్న వారి ప్రయ్తనాలు మాత్రం ఫలించడం లేదు.
బ్రిస్బేన్ నుంచి 17 గంటల పాటు డ్రైవ్ చేస్తే వచ్చే గ్రామం జూలియా క్రీక్
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ పట్టణానికి శివారులో జూలియా క్రీక్ అనే విలేజ్ ఉంది. అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ఓ ఫిజీషియన్ ను నియమించుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఎవరూ రావడం లేదు. అంత కష్టం అయితే అంబులెన్స్ ను దగ్గర పెట్టుకుని వేగంగా దగ్గర్లో ఊరికి వెళ్లిపోతే సరిపోతుంది కదా అని చాలా మంది అనుకుంటారు. అసలు సమస్య అదే. క్విన్స్ ల్యాండ్ కు దగ్గరే కానీ అక్కడికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. బ్రిస్బేన్ వైపు వెళ్లాలంటే పదిహేడు గంటల సమయం పడుతుంది. అంతకు మించి దగ్గర్లో మరో పట్టణం ఉండదు.
అద్భుతమైన గ్రామం అయినా సమీపంలో పట్టణాలు లేకపోవడం సమస్య
అస్ట్రేలియా ప్రత్యేకంగా ఉపఖండం. అత్యంత విశాలమైన దేశం. అక్కడ ఊరుకు ఊరుకు మధ్య ప్రయాణం గంటల్లోనే ఉంటుంది. జూలియా క్రీక్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ సిటీకి బ్రిస్బేన్ కాకుండా దగ్గరలోఉన్న చిన్న పట్టణం టౌన్స్‌విల్లే . ఈ సిటీకి వెళ్లాలంటే ఏడు గంటల పాటు డ్రైవ్ చేయాలి. ఎవరికైనా సుస్తీ చేస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే ఒక రోజు పడుతుంది. అందుకే వైద్యుడే తమ వద్ద ఉంటే బాగుండని.. రెట్టింపు శాలరీ ఆఫర్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఓ డాక్టర్ ఉన్నాడు. అతనికి ఐదు లక్షల డాలర్ల జీతం ఇస్తున్నారు. కానీ అతను ఇప్పుడు రిటైరవుతున్నాడు.అతని స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
గ్రామంలోనే ఉండే డాక్టర్ కోసం ఎదురు చూపులు
జూలియా క్రీక్ విశాలమైన ప్రాంతం ఉన్న గ్రామం. కానీ అది మారుమూల ప్రాంతం . 2022లో లౌస్ అనే డాక్టర్ రాకముందు 15 సంవత్సరాలుగా శాశ్వత వైద్యుడు లేడు. స్వల్పకాలిక బసల కోసం వచ్చే విజిటింగ్ వైద్యులే ఉండేవారు. 2024 ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఆట్రేలియాలో దేశవ్యాప్తంగా 2,500 మంది వైద్యుల కొరత ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కొరత ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతి తక్కువ జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటి.





















