Raju Weds Rambai Colletions : 'రాజు వెడ్స్ రాంబాయి' హిట్ బొమ్మ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Raju Weds Rambai Day 1 Collection : విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Raju Weds Rambai Movie First Day Box Office Collection : రీసెంట్‌గా వచ్చిన చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'లిటిల్ హార్ట్స్' ఇటీవల మంచి సక్సెస్ అందుకోగా అదే స్ట్రాటజీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఫస్ట్ డే కలెక్షన్స్...
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి'... మన ఊరి కథ... మన విలేజ్ లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.47 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదే జోష్‌తో 100 కొత్త స్క్రీన్స్ పెంచుతున్నట్లు చెప్పారు. చిన్న సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. మోత్ టాక్‌తోనే మరింత హైప్ క్రియేట్ అవుతుండడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ మూవీలో అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తేజస్వి రావు హీరో హీరోయిన్లుగా నటించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా... 'నీది నాదీ ఒకటే కథ', 'విరాట పర్వం' మూవీస్ డైరెక్టర్ వేణు ఊడుగుల... రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించారు. ఈటీవీ విన్ సమర్పణలో రూపొందిన మూవీ... బన్నీ వాస్, వంశీ నందిపాటి ద్వారా థియేటర్లలోకి వచ్చింది. పూర్తిగా కొత్త వారితో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో విలేజ్ లవ్ స్టోరీని డైరెక్టర్ సాయిలు అందంగా చూపించారు.
Also Read : మనందరి ఫేవరెట్ 'అమృతం' సీరియల్ ఈజ్ బిగ్ బ్యాక్ - ఎందులో చూడొచ్చంటే?... స్పెషల్ ట్రైలర్ చూశారా!
కొద్ది రోజుల క్రితం వచ్చిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'లిటిల్ హార్ట్స్' సైతం హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.1.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా... మొత్తంగా రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ఇంతగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' కూడా అంతే స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
అందమైన పల్లెటూరి స్వచ్ఛమైన క్యూట్ 'రాజు వెడ్స్ రాంబాయి'. ఉమ్మడి ఏపీ వరంగల్ - ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరిలో రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ వాయించడంలో దిట్ట. అదే ఊరిలో ఉండే రాంబాయి (తేజస్విని రావు)ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాడు. తొలుత ఇష్టపడకున్నా... ఆ తర్వాత రాజును లవ్ చేస్తుంది రాంబాయి. అయితే, తన కూతురిని గవర్నమెంట్ ఉద్యోగికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ).
అయితే, రాంబాయితో పెళ్లికి ఆమె తండ్రి వెంకన్నను ఒప్పించడం కష్టమని భావించిన రాజు... రాంబాయిని పెళ్లికి ముందే గర్భవతిని చేస్తే తప్పక తనకే ఇచ్చి పెళ్లి చేస్తాడని అనుకుంటాడు. అలా రాజు, రాంబాయి ఒక్కటై ఆమె గర్భవతి అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? రాజు, వెంకన్న మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి? రాజును రాంబాయి తండ్రి ఏం చేశాడు? రాజు రాంబాయి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















