అన్వేషించండి

Kuppam Nara Bhuvaneshwari: చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి - కుప్పంలో మూడు రోజుల పాటు ప్రజలతో మమేకం !

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు ప్రజలతో కలిసిపోయి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమస్యలను తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Nara Bhuvaneshwari spent four  days in Kuppam : ముఖ్యమంత్రి బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండే  సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా తన బాధ్యతలను ఎక్కువగా పార్టీ నేతలకు వదిలేస్తారు. అయితే  ఈ సారి మాత్రం ఆయన బాధ్యతలను నారా భువనేశ్వరి కూడా తీసుకుంటున్నారు.  నారా భువనేశ్వరి కుప్పం శాసనసభా నియోజకవర్గంలో నాలుగు  రోజుల పర్యటనలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యకర్తగా, ఈ పర్యటనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, స్వయం సహాయక బృందాలతో సమావేశాలు నిర్వహించి, ప్రజా సమస్యలు విన్నారు.  నేను ముఖ్యమంత్రి భార్యగా కాకుండా, టీడీపీ కార్యకర్తగా వచ్చానని చెప్పి అందరితో మమేకం అయ్యారు. 

నవంబర్ 20న కుప్పంలోకి చేరుకున్న భువనేశ్వరి, మొదట గుడిపల్లి మండలంలో  మహిళలతో సమావేశమయ్యారు. సోలార్ విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, అందరికీ ఇళ్లు ఇవన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రజల నుంచి  200కు పైగా పిటిషన్లు స్వీకరించారు. ఈ సమావేశంలో తమిళంలో "ఎలారిక్కి సౌగ్యమా?" (ఎలా ఉన్నారు?) అని పలకరించి, స్థానికులను ఆకట్టుకున్నారు.   

నవంబర్ 21న కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో సమావేశమయ్యారు.  తన కాలేజ్ రోజులు, చంద్రబాబు, లోకేష్‌లతో జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.  "సమరసింహారెడ్డి సినిమాలో 'ఒక వైపు చూడు, రెండో వైపు చూడకు' అనే డైలాగ్ లాగా, మీరు లక్ష్యంపై దృష్టి పెట్టండి" అని సలహా ఇచ్చారు. . శాంతిపురం మండలంలో స్వయం సహాయక బృందాలతో సమావేశమై, "మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత. చంద్రబాబు 40 పథకాలు ద్వారా కుప్పాన్ని అభివృద్ధి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఉపాధి అవకాశాలు తీసుకువస్తాం" అని ప్రకటించారు.  రామకుప్పం మండలంలోని చల్దిగనిపల్లిలో మహిళలతో ముఖాముఖి  సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సులో ప్రయాణించారు. 
  
రామకుప్పం మండలంలో కార్యకర్తల ఇళ్లకు వెళ్లారు.  ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. గ్రామసభల్లో పాల్గొని, "కుప్పం ప్రజలు మా కుటుంబానికి 35 సంవత్సరాలుగా మద్దతు ఇచ్చారు. మీ సమస్యలు మా సమస్యలు" అని చెప్పారు. కోదండరామ స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో  కలిసి పాల్గొన్నారు  కుప్పం మున్సిపాలిటీలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభఇంచారు.  ఈ మూడు రోజుల్లో భువనేశ్వరి గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాలను పరిశీలించారు. 500కు పైగా కుటుంబాలను పరామర్శించారు. నీటి ట్యాప్‌లు, సోలార్ ప్యానెల్స్, రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం వస్తానని హామీ ఇచ్చారు.    

నారా భువనేశ్వరి ప్రజలతో మమేకమైన విధానం టీడీపీ కార్యకర్తలనే కాదు.. సామాన్యులను కూడా ఆకర్షించింది. ఉచిత బస్సులో ప్రయాణించారు.. పాలారు నదిలో చిన్న బోటుపై విహరించారు. అందరితో కలివిడిగా ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget