Shiva Jyothi : తిరుమల ప్రసాదంపై కామెంట్స్ - వివాదంలో యాంకర్ శివజ్యోతి... వీడియో వైరల్
Shiva Jyothi Comments : ప్రముఖ యాంకర్ శివ జ్యోతి వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనంలో భాగంగా క్యూలైన్లో ఇచ్చే ప్రసాదంపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Shiva Jyothi Comments On Tirupati : యాంకర్ శివ జ్యోతి... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ యాసలో తనదైన స్టైల్‌లో తీన్మార్ సావిత్రిగా ఈమె చెప్పిన వార్తలతోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బిత్తిరి సత్తితో ఈమె చెప్పే ముచ్చట్లకు బుల్లి తెర ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని షోలకు యాంకరింగ్ చేసినా ప్రస్తుతం స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని టీవీ షోల్లోనూ మెరుస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శివజ్యోతి... తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
ప్రసాదంపై కామెంట్స్...
తిరుపతి శ్రీవారి దర్శనం క్యూ లైన్‌లో ఇచ్చే అన్న ప్రసాదంపై శివ జ్యోతి చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. టీటీడీ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. తన ఫ్రెండ్ సోను అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని తీసుకుంటుండగా... 'సోను కాస్ట్ లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్.' అంటూ నవ్వుతూ కామెంట్స్ చేసింది. 'జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నా.' అంటూ ఆమె ఫ్రెండ్ కామెంట్ చేశాడు. 'తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ నవ్వింది. 'అడుక్కున్నా కానీ... బాగుంది గాయ్స్.' అంటూ శివజ్యోతి ఫ్రెండ్ అన్నాడు.
Dis is so cheap on her part n only shows her true colors,a youtuber named Shiva Jyothi is comparing pilgrims as beggars n comparing themselves as Kubera who r asking prasadam?
— Swetha ✨️ (@Sweth_Cosmos) November 21, 2025
Dis same fellow has allegations on her for promoting betting apps, Karma will slap her in right time🙏🏻 https://t.co/02nZS2e5T5
భక్తులు, నెటిజన్ల ఆగ్రహం
ప్రసాదంపై శివజ్యోతి నవ్వుతూ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతుండగా... శ్రీవారి భక్తులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి అన్న ప్రసాదాన్ని, భక్తులను అవమానించిందని అంటున్నారు. 'ఇది ఆమె నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. యాత్రికులను బిచ్చగాళ్లతో పోల్చింది. ప్రసాదం అడుగుతున్న తమను తాము కుబేరులతో పోల్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కర్మ సరైన టైంలో ఆమెకు బుద్ధి చెబుతుంది.' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... 'ఈమెను టెంపుల్‌లోకి రాకుండా బ్యాన్ చేయాలి. టీటీడీ చర్యలు తీసుకోవాలి.' అంటూ ఏకిపారేస్తున్నారు. మరి దీనిపై శివజ్యోతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
Also Read : మహేష్ 'వారణాసి' మ్యూజిక్, సాంగ్స్ - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన కీరవాణి... ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ చేసేశారుగా!






















