అన్వేషించండి

Maoists surrender: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !

Telangana DGP :తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆజాద్ కూడా ఉన్నారు.

37 Maoists surrender before Telangana DGP:  మావోయిస్టులు తెలంగాణలో మరో తీవ్రమైన  ఎదురు దెబ్బ తగిలింది.   రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి ముందు మొత్తం 37 మంది మావోయిస్టులు శనివారం లొంగుబాటు చేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.  మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గుతోందని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే భావన పెరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
 
తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లొంగుబాటు జరిగింది. 37 మందిలో 25మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. వీరు అజాద్, అప్పాసి నారాయణ (రమేష్) వంటి స్టేట్ కమిటీ నేతలు, అలాగే ఏవోబీ  ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినవారు. ఆజాద్‌కు మావోయిస్టు పార్టీలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఏవోబీ ప్రాంతంలో ఆయుధాలు, రిక్రూట్‌మెంట్, ప్రచార విభాగాల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించాడు. రమేష్ కూడా స్టేట్ కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశాడు.

పోలీసులు ఈ లొంగుబాటు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరాలు వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన ఆయుధాల్లో 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్‌లు, వేలాది బుల్లెట్లు, క్యార్ట్రిజ్ సీజ్‌లు ఉన్నాయి. ఈ ఆయుధాలు మావోయిస్టు ఆపరేషన్లకు ఉపయోగపడేవి. డీ ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ నష్టం. 2025లో మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 

కొయ్యాడ సాంబయ్య (ఆజాద్) మావోయిస్టు పార్టీలో 2000ల నుంచి ఉన్నాయి.   అతను ఏవోబీ ప్రాంతంలో  పార్టీ సెక్రటారీగా పనిచేశాడు. ఆయుధాల పంపిణీ, క్యాడర్ రిక్రూట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు. పోలీసుల పటిష్ఠమైన ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆజాద్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు  

కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించింది. ఈ దిశగా 'ఆపరేషన్ కగార్' ప్రారంభమైంది. తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా పటిష్ఠమైన ఇంటెలిజెన్స్,   పాలసీని అమలు చేస్తున్నారు. 2025లో ఇప్పటికే 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు.   ఈ లొంగుబాటు మావోయిస్టు ఐడియాలజీ ఇక ఉనికిలో ఉండదని , క్యాడర్లు మెయిన్‌స్ట్రీమ్‌లో చేరాలనే భావన పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ 37 మంది మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ రిహాబిలిటేషన్ పాలసీ ప్రకారం సహాయం అందిస్తున్నారు.  ఆర్థిక సహాయం , ఉపాధి అవకాశాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు.  మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగా మరిన్ని లొంగుబాట్లు ఉంటాయని డీజీపీ తెలిపారు.     

అనారోగ్యంతో పాటు మారిన పరిస్థితులతో తాము  జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నట్లుగా లొంగిపోయిన మావోయిస్టులు ప్రకటించారు.  కేంద్ర కమిటీలో ఇంకా ఇద్దరు ఉన్నారని వారు కూడా లొంగిపోవాలని సలహా ఇచ్చారు. పార్టీకి చెప్పే తాము లొంగిపోాయమన్నారు.                

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు సింగపూర్ నిర్ణయం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో భేటీ
తెలంగాణలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు సింగపూర్ నిర్ణయం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో భేటీ
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 19న ప్రారంభం, రూ.1 లక్ష జమ
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 19న ప్రారంభం, రూ.1 లక్ష జమ
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget