Defender Car Loan EMI Payment: డిఫెండర్ కారు కొనేందుకు 4 సంవత్సరాల లోన్ తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి.. మొత్తం ధర ఎంత
Car loan on Defender EMI payment | డిఫెండర్ కారు ధర దాదాపు కోటి రూపాయలు ఉంటుంది. కనుక మీరు లోన్ ద్వారా కొనుగోలు చేసి, ప్రతినెలా EMI చెల్లించి కారు సొంతం చేసుకోవచ్చు.

Defender Car Loan : ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్లు భారత మార్కెట్లో చాలా ఫేమస్ అయ్యాయి. డిఫెండర్ కూడా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర 98 లక్షల రూపాయలకు ప్రారంభం కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర 2.60 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ లగ్జరీ కారులో చౌకైన మోడల్ 2.0 లీటర్ పెట్రోల్ 110 X-డైనమిక్ HSE. డిఫెండర్ కారు ఈ వేరియంట్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వేరియంట్‌గా నిలిచింది. డిఫెండర్ కారు ఈ మోడల్ ధర 98 లక్షల రూపాయలు. ఈ లగ్జరీ కారును కొనుగోలు చేయడానికి ఏకంగా రూ. 88.20 లక్షల వరకు రుణం (Car Loan) లభిస్తుంది.
EMI పై డిఫెండర్ కారు ఎలా కొనాలి?
డిఫెండర్ చాలా ఖరీదైన కారు. ఈ లగ్జరీ కారును కొనుగోలు చేయడానికి మీరు దాదాపు 4 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, ఈ కారు EMI చెల్లించడానికి మీ ఖర్చులతో పాటు అదనంగా 2 లక్షల రూపాయలకు పైగా ఉండాలి. మీరు కొనుగోలు చేయడానికి 9.80 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేయాలి. ఈ కారు కొనుగోలుపై 9 శాతం వడ్డీ ఉంటే, అప్పుడు 4 సంవత్సరాల పాటు (48 నెలల పాటు) రుణం తీసుకుంటే, ప్రతి నెలా 2.20 లక్షల రూపాయల ఈఎంఐ చెల్లించాలి.
- మీరు డిఫెండర్ కొనడానికి 5 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 1.83 లక్షల రూపాయల EMI చెల్లించాలి.
- డిఫెండర్ కారు కొనడానికి 6 సంవత్సరాల లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 1.59 లక్షల రూపాయలు ప్రతినెలా చెల్లించాలి.
- ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొనేందుకు 7 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 1.42 లక్షల రూపాయలు చెల్లించాలి.
డిఫెండర్ కొనడానికి మీరు ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్లో జమ చేస్తే, అప్పుడు మీ నెలవారీ చెల్లించే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. కానీ కారు కొనుగోలు చేయడానికి లోన్ తీసుకునేటప్పుడు అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. కార్ కంపెనీలు, బ్యాంకుల వేర్వేరు విధానాల కారణంగా, ఈ లెక్కలు, వడ్డీలో వ్యత్యాసం ఉండవచ్చు.






















