అన్వేషించండి

Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు

Suryalanka Beach: కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సూర్యలంక బీచ్‌కు స్వదేశ్‌దర్శన్ 2.0 పథకంలో 97కోట్లు కేటాయించారు.

Suryalanka Beach: బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద సూర్యలంక బీచ్‌ ఫ్రంట్ అభివృద్ధికి 97.52కోట్లు కేటాయించింది. రాష్ట్ర పర్యాటక శాఖ AP Tourism సమర్పించిన DPRకు అనుగునంగా ఈ నిధులు కేటాయింపు జరిగింది. సూర్యలంక కు వచ్చే పర్యాటకులు ప్రపంచ స్థాయి పర్యాటక అనుభూతిని పొందేలా ఈ నిధులు ఖర్చు చేస్తామని రాష్ట్ర పర్యాటకమంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నిధుల్లో  పర్యాటకానుభూతిని మెరుగుపరచడానికి, కొత్త అంశాలను రూపొందించేందుకు ₹15.43 కోట్లు, షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధికి ₹4.37 కోట్లు, స్థి పర్యాటక వాహనాల పార్కింగ్ సదుపాయాల కోసం ₹7.76 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే బ్యాక్ వాటర్ కోసం ₹11.69 కోట్లు, సూర్యలంక Experience Zone అభివృద్ధికి ₹19.36 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ₹18 కోట్లు వినియోగించనున్నారు.

ఇంతకు ముందే  అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 172.34 కోట్లు మంజూరు చేసింది.  ఈ ఆమోదంతో, ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం నిధులు ₹269.86 కోట్లకు చేరాయి.

 

అమరావతికి- హైదరాబాద్‌కు దగ్గర అదే సూర్యలంక స్పెషాలిటీ

బాపట్ల జిల్లా సూర్యలంకలోని బీచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కొత్త రాజధాని అమరావతికే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కూడా సమీపంలో ఉన్న బీచ్‌ సూర్యలంక. హైదరాబాద్‌ నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇప్పటికే ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేను నర్సరావుపేట వద్ద నుంచి బాపట్లతో కలిపేలా మరో నాలుగు వరుసల హైవేకు ఈ మధ్యనే ఆమోదం తెలిపారు. అది పూర్తైతే... హైదరాబాద్ నుంచి నేరుగా బీచ్‌కు ఫోర్‌లేన్ జాతీయ రహదారి వచ్చేస్తుంది.   కోస్తా జాతీయ రహదారిని ఇప్పటికే డవలప్ చేశారు.  ఇక బాపట్ల బీచ్‌ కేవలం సముద్ర తీరం మాత్రమే కాదు. దీంట్లోకి ఓ కెనాల్ కూడా కలుస్తుంది. దాంతో బ్యాక్‌వాటర్ టూరిజం ను కూడా డవలప్‌ చేయొచ్చు.


Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు

గ్లోబల్ ఐకానిక్ రీట్రీట్‌గా సూర్యలంక

అమరావతికి సముద్రతీరాన ఉన్న ప్రధాన అట్రాక్షన్ సూర్యలంక. ఇప్పటికే ఇక్కడ టూరిజం శాఖ హరిత రిసార్టులు నిర్వహిస్తోంది. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ రిసార్టులున్నాయి. సూర్యలంకను  GLOBAL ICONIC RETREAT గా తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా Scheme for Special Assistance to States for Capital Investment (SASCI) పథకం కోసం 101కోట్లకు APTDC డీపీఆర్ ఇచ్చింది. ఇందులో బీచ్‌ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడం, లాండ్ స్కేపింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ ల అభివృద్ధి, Sailing Club వంటి అంశాలున్నాయి. బీచ్‌లో ఐకానిక్ ధ్యానమందిరం కన్వెన్షన్ సెంటర్‌ను కూడా ప్రతిపాదించారు.  బీచ్‌లో కలిసే కాలువపైన House  Boating, Floating Restaurant ను ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా సూర్యలంక సమీపంలో ప్రైవేట్ భాగస్వామ్యంలో 650కోట్లతో ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టులు వస్తున్నాయని కూడా డీపీఆర్‌లో పేర్కొన్నారు.


Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు

స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి...?

స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్ట్ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన ఒక పర్యాటక అభివృద్ధి కార్యక్రమం. ఇది స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్ కి కొత్త రూపం, దీని ద్వారా దేశీయ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా  పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం, స్థానిక ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం, రోడ్లు, హోటళ్లు, పార్కింగ్, సమాచార కేంద్రాలు వంటి మౌలిక వసతులు కల్పించడం,  భారతీయ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రోత్సహించడం వంటివి ఈ ప్రాజెక్టులో చేపడతారు.  స్వదేశ్ దర్శన్ 2.0 ప్రత్యేకంగా సమగ్ర పర్యాటక ప్రణాళిక (Holistic Tourism Development) పై దృష్టి సారిస్తుంది. ఇందులో రూరల్, ఎకోటూరిజం, ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!
Amaravati Seed Access Road: అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget