Goa tourism : చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్న గోవా ప్రభుత్వం - టూరిస్టుల్ని దోపిడీ చేయకుండా ఏం చేస్తున్నారంటే ?
Goa: గోవాలో టూరిస్టుల రాక తగ్గిపోవడంతో అక్కడి ప్రభుత్వం మేల్కొంది. టూరిస్టుల్ని .. అక్కడి వ్యాపారాలు దోపిడీ చేయకుండా కొన్ని చర్యలు చేపట్టింది.
Goa to rejig taxi fares and make wedding hosting easier : దేశ పర్యాటకులకు గోవా హాట్ ఫేవరేట్. ఎవరైనా జల్సా చేయాలనుకుంటే అక్కడికి వెళ్లాలనుకుంటారు. అదే సమయంలో విదేశీ పర్యాటకులకూ గోవా హాట్ స్పాట్. ప్రతి ఏటా లక్షల మంది విదేశీ టూరిస్టులు గోవాకు వస్తూంటారు.అయితే ఇటీవలి కాలంలో గోవాకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది.గత న్యూఇయర్ వేడుకలకు గోవా బీచ్‌లు ఖాళీగా ఉండటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. దీంతో అక్కడి ప్రభుత్వం నిద్ర లేచింది. కొన్ని జాగ్రత్త్లు తీసుకుంది.
గోవా ఎయిర్ పోర్టులోనో... రైల్వే స్టేషన్‌లోనే దిగిన వెంటనే అక్కడి టాక్సీ డ్రైవర్లు తమ ప్రతాపం చూపిస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఫ్లైట్ చార్జీల కన్నా ఎక్కువగా వసూలు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారు. అడిగినంత మొత్తం ఇవ్వకపోతే రౌడీయిజం చేస్తారు. ఎక్కువగా ఈ అంశంపై కంప్లైంట్లు ఉండటంతో ట్యాక్సీల రేట్లను అన్ని చోట్ల డిస్ ప్లే చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక్షంగా టూరిజంపై సమీక్ష చేసి క్యాబ్‌ల రేట్లను నియంత్రించాలని ఆదేశించారు. ఎక్కడెక్కడికి ఎంత చార్జీలు వసూలు చేయాలో బోర్డులు పెట్టాలని అంత కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరల నిర్దారణకు అధికారులతో పాటు టాక్సీ సంఘాల వారితో ఓ కమిటీ వేశారు.
ఇక పర్యాటక పరంగానే కాదు వ్యాపార కార్యకలాపాల పరంగా కూడా గోవాను మళ్లీ గాడిలో పెట్టేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మైస్ విదానంలో బాగంగా అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రత్యేకమైన రాయితీలు, సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. టూరిస్టులు వల్లే కాకుండా వ్యాపార సంస్థల తమ ప్రత్యేక సందర్భాల్లో కార్యక్రమాలను గోవాలో ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. అదే సమయంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు గోవా ఓ హాట్ స్పాట్ లా మారేలా ఇన్ ఫ్రా డెలవప్ చేయాలని డిసైడ్ అయ్యారు.
మన దేశంలో వెడ్డింగ్ టూరిజం మార్కెట్ గోవాకే ఎక్కువ. అయితే గోవాలో ఉన్న పరిస్థితుల కారణంగా చాలా మంది అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కూడా.. వియత్నాం, శ్రీలంక, థాయ్ లాండ్ వంటి దేశాల వైపు చూస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్న డెస్టినేషన్ వెడ్డింగ్ సౌకర్యాల కన్నా ఎక్కువగా గోవాలో కల్పించాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకూ ఉన్న పలు నిబంధనలను మార్చనున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు అక్కర్లేకుండా చేయనున్నారు. కల్చరల్ టూరిజం కూడా పెంచాలని అనుకుంటున్నారు.
గోవా మంచి టూరిస్టు కేంద్రం. టూరిస్టుల్ని ఎంత బాగా చూసుకుంటే అంత ఎక్కువ మంది వస్తారు.కానీ అక్కడి వ్యాపారుల కక్కుర్తి కారణంగా బంగారు బాతు లాంటి జూరిజాన్ని చంపేసుకుంటున్నారు. బతికించుకోవాలని అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో ?