అన్వేషించండి

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?

Mahakumbh 2025 : 2025 మహాకుంభమేళాలో తొలి రోజైన మంగళవారం 3.50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సాధువులు, భక్తులు పవిత్ర సంగమం వద్ద పుణ్య స్నానాలు చేశారు.

Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళా 2025కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. తొలి రోజైన సంక్రాంతి నాడు మంగళవారం 3.50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సాధువులు, అఖారాలు, భక్తులు పవిత్ర సంగమం వద్ద పుణ్య స్నానాలు చేశారు. పుణ్య స్నానాల్లో అధికారికంగా స్నానం చేసే వారి సంఖ్యను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుగా ప్రకటించారు. అయితే, సాయంత్రం వరకు సంగం ఒడ్డుకు భక్తుల ప్రవాహం చేరుకోవడం కనిపించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

పుణ్య స్నానాలు విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుగా సాధువులు, అఖారాలతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. విశ్వాసం, సమానత్వం, ఐక్యత గొప్ప సంగమంలో పవిత్ర 'మకర సంక్రాంతి' శుభ సందర్భంగా పవిత్ర సంగమంలో విశ్వాసంతో స్నానం చేసిన అన్ని గౌరవనీయులైన సాధువులు, కల్పవాసిలు, భక్తులకు శుభాకాంక్షలు' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు
రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వెళ్లే రోడ్లపై భారీ జనసమూహం కనిపించింది. ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టడానికి స్థలం లేదు. జనాన్ని హాలులోనే ఆపేశారు. రైళ్ల ప్రకారం వీరిని ప్లాట్‌ఫారమ్‌కి పంపుతున్నారు. ఈ ఉదయం నుంచి ఇప్పటివరకు 55 మహా కుంభ్ ప్రత్యేక రైళ్లను పంపించామని రైల్వే పీఆర్వో అమిత్ సింగ్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు నలుగురు గుండెపోటుకు గురయ్యారు. వీరిలో ముగ్గురు స్వరూప్ రాణి నెహ్రూ (SRN)లో, ఒకరు మేళా సెంట్రల్ హాస్పిటల్‌లో చేరారు. నైట్ షెల్టర్లు, హోటళ్లు నిండిపోయాయి. ప్రజలు రోడ్లపై గుమిగూడారు. రోడ్లపై తమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు.

Also Read : Mahakumbha mela: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా గ్లామరస్ సాధ్వీలు కూడా - హాట్ టాపిక్ గా హర్ష రిచారియా !

తరలివచ్చిన సాధువులు
పౌష పూర్ణిమ మొదటి స్నాన దినమైన సోమవారం, 1.65 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. మంగళవారం 3.5 కోట్ల.. 2 రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగంలో స్నానం చేశారు. సాధువులు హర్ హర్ మహాదేవ్ అని జపిస్తూ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఉదయం 6 గంటలకు పుణ్యస్నానాలు చూడటం ఒక అద్భుతమైన దృశ్యం. కత్తి, త్రిశూలం, డమరుకం చేతుల్లో పట్టుకుని, సాధువులు హర్ హర్ మహాదేవ్ అని జపిస్తూ ఘాట్లకు చేరుకున్నారు. మహా కుంభమేళాలో మొదటిసారిగా షాహి స్నాన్‌కు బదులుగా అమృత స్నాన్ అనే పదాన్ని ఉపయోగించారు. అఖారారు పేరు మార్చాలని ప్రతిపాదించారు.

ఆకాశం నుంచి పూల వర్షం 
మకర సంక్రాంతి సందర్భంగా మొదటి అమృత స్నానం పండుగ సందర్భంగా ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తూనే ఉంది. మహా కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించారు. యోగి ప్రభుత్వం తరఫున మొదటి అమృత్ స్నానం సందర్భంగా వచ్చిన భక్తులు, సాధువులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మకర సంక్రాంతి సందర్భంగా తీర్థయాత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో మొదటి అమృత స్నానం జరిగిందని సీఎం యోగి అన్నారు.  

డ్రోన్ల కలకలం
కుంభమేళాలో ఉత్తరప్రదేశ్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వైమానిక నిఘా ద్వారా భద్రతను కల్పిస్తున్నారు.  డ్రోన్ల సహాయంతో మహా కుంభమేళాలో భద్రతాపరంగా కొత్త యుగం ప్రారంభమైందని అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కుంభమేళాలోకి 9 అక్రమ డ్రోన్లు ప్రవేశించగా పోలీసులు ధ్వంసం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

People Digging Asirgarh Fort Chhaava Viral Video | సినిమాలో చూపించినట్లు గుప్త నిధులున్నాయనే ఆశతో | ABP DesamNTR Fan Koushik Passed Away | ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆకస్మిక మృతి | ABP DesamYS Viveka Case Witness Deaths | ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ? | ABP DesamRashmika Karnataka Government Controversy | రష్మికపై ఫైర్ అవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Borugadda Anil: నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో
నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో
Nani: ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
Viral Video: ఆ అమ్మాయి మీద పగబట్టిన కుక్కలు - గ్యాంగ్ ఎటాక్ -  ఈ వీడియో చూస్తే భయపడిపోతారు!
ఆ అమ్మాయి మీద పగబట్టిన కుక్కలు - గ్యాంగ్ ఎటాక్ - ఈ వీడియో చూస్తే భయపడిపోతారు!
Telangana News: 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 18 ఏళ్ల లోపు బాలికలతో సంఘాలు- తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
60 ఏళ్లు దాటిన వృద్ధులు, 18 ఏళ్లలోపు బాలికలతో సంఘాలు- తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
Embed widget