Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు వెళ్లారంటే CSK ఫ్యాన్స్ ఇప్పటికి నమ్మలేకపోతున్నారు. 12 సంవత్సరాల తర్వాత జడేజా CSKని వదిలి వెళ్లడంతో తలపతి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. అయితే ఈ ట్రేడ్ కి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ట్రేడ్ డీల్ జరగడానికి ముందు ధోని, రవీంద్ర జడేజా చర్చించుకున్నారని తెలుస్తోంది.
ట్రేడ్ డీల్ ప్రాసెస్ మొదలు కాకముందే జడేజా, ధోని మాట్లాడుకున్నారట. జడేజా CSK నుండి వెళ్లడమే మంచిదని ఇద్దరూ అంగీకరించారని అంటున్నారు. కొన్ని విషయాల కారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో జడేజా స్థానంపై ముప్పు తెచ్చే అవకాశం ఉందని.. ఈ విషయంలో ధోని జడేజాతో మాట్లాడాడని వార్తలు వినిపిస్తున్నాయి. జడేజా కూడా చెన్నైను వదిలి వెళ్లడమే తనకు సరైనదని ఒప్పుకున్నారట. రాజస్తాన్ టీమ్ లో జుడుకు కెప్టెన్సీ కూడా దొరికే అవకాశం ఉందని చర్చకు వచ్చినట్లు సమాచారం. మార్ RR కెప్టెన్ గా జడేజా భాద్యతలు తీసుకుంటారా లేదా చూడాలి.
ఇకపోతే సంజూ శాంసన్ ను కెప్టెన్సీ కోసం సీఎస్కే తీసుకుందని అంతా భావించారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ తమ కెప్టెన్ అని సీఎస్కే మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.





















