Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఐపీఎల్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన న్యూస్ ఫైనల్ గా వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ కు సంజూ శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్‌లో CSK ఈ యంగ్ ప్లేయర్ ను సొంతం చేసుకుంది. సంజుకు బదులుగా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లను ఆర్ఆర్‌కు ఇచ్చింది CSK.
రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు గుడ్ బాయ్ చెప్పిన తర్వాత సంజూ శాంసన్ తొలి సారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది బాగా వైరల్ అవుతుంది. ‘మనం ఇక్కడ కొద్ది కాలమే ఉంటాము. ఈ ఫ్రాంఛైజీ కోసం నేను అంతా చేశాను.. గేమ్ ను ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాను, ప్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబంలా భవించాను..అయితే.. ఇప్పుడు సమయం వచ్చింది. ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకే టీమ్ ను వీడాను. ఇక్కడ నాకు లభించిన ప్రతి దానికి నేను కృతజ్ఞతతో ఉంటాను.’ అని సంజూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
సంజూ శాంసన్ కు RR 18 కోట్లు చెల్లించేది. ఇప్పుడు చెన్నై కూడా అదే చేస్తుంది. కానీ జడేజాకు మాత్రం 14 కోట్లు చెల్లించనుంది RR. ఇక సామ్ కర్రన్ ప్రస్తుత ఫీజు 2.4 కోట్లనే అందుకోనున్నాడు.




















